వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ ఫోన్ ట్యాపింగ్ పై ట్విస్ట్-లోక్ సభ సచివాలయం కీలకఆదేశం-ఇరుకునపడ్డ జగన్ సర్కార్ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతోనే విభేదిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ సర్కార్ ను మరో విషయంలో టార్గెట్ చేశారు. తన ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తున్నట్లు లోక్ సభ సచివాలయానికి ఆయన ఇచ్చిన ఫిర్యాదు సంచలనం రేపుతోంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన సెక్రటేరియట్ .. హోంశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో తేనెతుట్టె కదిలేలా కనిపిస్తోంది.

రఘురామ ఫోన్ ట్యాపింగ్

రఘురామ ఫోన్ ట్యాపింగ్

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత మూడేళ్లుగా వైసీపీ సర్కార్ ను, వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ప్రతీ రోజూ రచ్చబండల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా రఘురామ విషయంలో ఇంటెలిజెన్స్ సహా పలు నివేదికలు తెప్పించుకుంటూనే ఉంది. రఘురామ కదలికలపైనా నిఘా ఉంది. ఆయన ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇదే వ్యవహారాన్ని ఆయన లోక్ సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎంపీ అయిన తన ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఇందులో ఏపీకి చెందిన ఇద్దరు అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు.

లోక్ సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు

లోక్ సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు

ఏపీకి చెందిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇందులో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుతో పాటు సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ పేర్లను ప్రస్తావించారు. తన ఫోన్ ట్యాపింగ్ కు వీరిద్దరు బాధ్యులని తెలిపారు. సభా హక్కుల ఉల్లంఘన కింద దీనిపై విచారణ జరిపి వీరిద్దరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీని కోరారు. దీంతో స్పీకర్ ఈ ఫిర్యాదును లోక్ సభ సచివాలయానికి పంపారు.

హోంశాఖ రిపోర్ట్ కోరిన సెక్రటేరియట్

హోంశాఖ రిపోర్ట్ కోరిన సెక్రటేరియట్

రఘురామ నుంచి అందిన ఫిర్యాదును పరిశీలించిన లోక్ సభ సచివాలయం.. ఆయన ఏపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై స్పందించింది. ఎంపీగా ఉన్న రఘురామరాజు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా లేదా అనే దానిపై నివేదికలు తెప్పించాలని నిర్ణయించింది. దీంతో కేంద్ర హోంశాఖకు లోక్ సభ సచివాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి 15 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వాస్తవ వివరాలు తెప్పించుకుని తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ నివేదిక కోరబోతోంది.

కీలకంగా హోంశాఖ రిపోర్ట్ ?

కీలకంగా హోంశాఖ రిపోర్ట్ ?


ఏపీ ప్రభుత్వం నుంచి వాస్తవ వివరాలతో నివేదిక కోరారని లోక్ సభ సచివాలయం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయబోతోంది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా నిర్దేశిత గడువులోగా వివరాలు ఇవ్వడం ఖాయం. ఇందులో తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఏపీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా చెప్పుకునే అవకాశాలుండవు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చే నివేదికపై హోంశాఖ స్పందన ఎలా ఉండబోతోందన్నది కీలకం. హోంశాఖ ఇచ్చే ఈ కీలక నివేదిక ఆధారంగానే లోక్ సభ సచివాలయం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

English summary
in big setback to ysrcp govt in ap, loksabha secretariat ask mha report on rebel mp raghurama krishnam raju phone tapping allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X