రామానాయుడు స్టూడియోస్ కు ఏపీ సర్కార్ భారీ షాక్...! ఆ భూములు వెనక్కి..!
టాలీవుడ్ లో ప్రముఖ రామానాయుడు స్డూడియోస్ కు ఇవాళ ఏపీ సర్కార్ భారీ షాకిచ్చింది. వైజాగ్ వేదికగా సినీ పరిశ్రమ అభివృద్ధి పేరుతో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రామానాయుడు స్డూడియోస్ కు కేటాయించిన భూముల్లో వివాదాస్పద భూముల్ని రద్దు చేసేసింది. దీంతో పాటు యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో రామానాయుడు స్డూడియోస్ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఆసక్తి రేపుతోంది.
విశాఖలో గతంలో రామానాయుడు స్డూడియోస్ కు ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీన్ని సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించారు. అయితే ఇందులో 15.17 ఎకరాలను నివాస స్థలాల కోసం మార్పు చేయాలని కోరుతూ రామానాయుడు స్డూడియోస్ దరఖాస్తు చేసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన కోర్టుల్ని, ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి.

వైజాగ్ లో రామానాయుడు స్టూడియోస్ భూముల వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.., జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై అప్పట్లో ప్రభుత్వం స్పందించలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆయా భూముల్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. అయితే భూముల రద్దును నిబంధనల ప్రకారమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ముందుగా రామానాయుడు స్డూడియోస్ కు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూముల్ని నివాస యోగ్యంగా మార్పు కోసం ప్రయత్నించడంపై వివరణ తీసుకుని, ఆ తర్వాత భూకేటాయింపులు రద్దు చేయబోతున్నారు. దీంతో రామానాయుడు స్డూడియోస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications