కుంభమేళా నుంచి తిరిగొస్తూ తిరిగిరాని లోకాలకు.. తెలంగాణ వాసులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లి తిరిగివస్తూ.. జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఎదురుగా వన్ వేలో వస్తున్న ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రమాదానికి గురైన మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఏపీ అని ఉండటంతో బాధితులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుగా అనుకున్నారు. అయితే మృతదేహాల వద్ద లభించిన ఆధారాల మేరకు వారిని తెలంగాణలోని నాచారం వాసులుగా పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Seven people from AP died in road accident while Returning from Kumbh Mela

మరోవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం జబల్‌పూర్ కలెక్టర్‌ తో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆయనను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరారు. మృతదేహాలకు వెంటనే పంచనామా చేసి, త్వరగా స్వస్థలాలకు త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రమాదం జరిగిన సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారని తెలుస్తోంది. బస్సులో ఉన్న మిగతా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద వార్తతో మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా వారి సానుభూతి తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+