ఆటో డ్రైవర్ విధ్యార్థినిపై అత్యాచారయత్నం, ఆటోలో నుండి దూకి ఇలా....

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్:పాఠశాలకు వెళ్ళివస్తున్న ఓ విధ్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి ప్రయత్నించాడు.అయితే నిందితుడి నుండి తప్పించుకొనేందుకుగాను ఆ బాలిక ఆటో నుండి దూకింది.ఈ ఘటనలో ఆ బాలికకు తీవ్ర గాయాలయాయ్యాయి. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది.

కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఈ ఘటన బుదవారం నాడు చోటుచేసుకొంది. ఇదే గ్రామంలోని పాఠశాలలో ఏడవ తరగతి చదివే విధ్యార్థిని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఆటో డ్రైవర్ విధ్యార్థినిపై అత్యాచారయత్నం, ఆటోలో నుండి దూకి ఇలా....

ఆటోలో ఎవరూ లేకపోవడంతో బాలికపై ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికదాడికి పాల్పడ్డాడు.దీంతో భయంతో ఆ బాలిక ఆటో నుండి కిందకు దూకింది.

ఆటో నుండి కిందకు దూకడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్తలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
seventh class girl rape attempt by auto driver in kurnool district on wednesday.
Please Wait while comments are loading...