Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోసాని చుట్టూ కేసుల వల: బెయిల్ లభించినా..!!

Posani Krishna Murali: ప్రముఖ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణ మురళి మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే అరెస్ట్ అయిన పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు.

ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రిమాండ్‌లో ఉన్నారు. అన్నమయ్య రాయచోటి జిల్లా రాజంపేట సబ్‌జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ఈ నెల 13వ తేదీ నాటికి రిమాండ్ ముగుస్తుంది. ఈలోగా బెయిల్ కోసం ఆయన పిటీషన్ దాఖలు చేసుకున్నారు. ఇది- సోమవారం విచారణకు రానుంది.

Several cases has been reportedly lodged against Posani Krishna Murali

ఒక కేసులో పోసానికి బెయిల్ లభించితే- మరో కేసులో అరెస్ట్ చేసేలా వల పన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఒకదాని వెంట ఒకటి అన్నట్టుగా కేసులు ఆయనను చుట్టుముట్టేలా పరిస్థితులు తలెత్తినట్లు చెబుతున్నారు. దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తోంది వైఎస్ఆర్సీపీ.

మరోవంక- ఆయనకు బెయిల్ ఇప్పించడానికి వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా పోసాని కేసును వాదిస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం బెయిల్ పిటీషన్.. అన్నమయ్య రాయచోటి జిల్లా రైల్వే కోడూరు న్యాయస్థానం సమక్షానికి రానుంది.

ఇందులో బెయిల్ లభించిందనుకున్నా ఆ వెంటనే మరో కేసు కింద అరెస్ట్ చేసేలా రాష్ట్రవ్యాప్తంగా పోసాని కృష్ణ మురళిపై 14 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 16 కేసులు నమోదు చేశారని పొన్నవోలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రశ్నించే గొంతులను అణచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా అభివర్ణించారాయన.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో ఉందంటూ విమర్శించారు. పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడానికి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిందంటూ ధ్వజమెత్తారు పొన్నవోలు. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోన్నారంటూ ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+