• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు- ప్రాణనష్టం : ఇళ్లపై బాధితులు -హెలికాప్టర్ తో ఆహార పొట్లాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వరద ఉప్పెనలా వచ్చి గ్రామాలను ముంచెత్తింది. అనేక ప్రాణాలను బలి తీసుకుంది. కడప జిల్లాలోని చెయ్యేరు నది పై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు కట్ట పూర్తిగా కొట్టుకుపోయింది. అనేక గ్రామాలను ముంచెత్తింది. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు సమీపంలో కట్ట తెంచుకున్న ప్రాజెక్టు వరద అనేక మంది ప్రాణాలు తీసింది. ప్రభావిత గ్రామాల్లో ప్రజలు తల్లడిల్లిపోయారు. అయితే, వారి కన్నీరూ వరదలోనే కలిసిపోయింది.

  Tirupati Floods : Annamayya Project పోటెత్తిన వరద | Chittoor | Tirumala || Oneindia Telugu

  వంట సామగ్రి, తిండిగింజలు, కట్టుబట్టలు, విలువైన బంగారు ఆభరణాలు, నగదు, రిఫ్రిజిరేటర్స్‌, బీరువాలు, మంచాలు.. ఇలా సర్వం వరదార్పణం అయ్యాయి. వరద కబళించిన గ్రామాల్లో ఒక్కో కుటుంబం రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పైగా నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు.

  కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు

  కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు

  అన్నమయ్య ప్రాజెక్టు 2001లో వినియోగంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెయ్యేరుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు పింఛా ప్రాజెక్టుకు 38 వేల క్యూసెక్కులు ఉన్న వరద రాత్రి 7.30 గంటలకు లక్ష క్యూసెక్కులు దాటేసింది. అప్పటికే ఆ ప్రాజెక్టు రింగ్‌బండ్‌ కొట్టుకుపోయింది. పింఛా ప్రాజెక్టు నుంచే కాకుండా.. మాండవ్య నది నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.

  మనిగిపోయిన జాతీయ రహదారి

  మనిగిపోయిన జాతీయ రహదారి

  ఈ డ్యామ్‌ స్విల్‌వే డిశ్చార్జి కెపాసిటీ 2.85 లక్షల క్యూసెక్కులు కాగా... 3.50 లక్షల క్యూసెక్కులకు అది చేరింది. ఏ క్షణమైనా కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెల్లవారుజామున అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ హెచ్చరికలు వచ్చిన గంటలోపే భారీశబ్దంతో డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్టు దగ్గర వరద కడప-తిరుపతి జాతీయ రహదారిని ముంచెత్తింది. ఆ సమయంలో అటుగా వచ్చిన పల్లె వెలుగు బస్సు పూర్తిగా మునిగిపోయింది. అందులోని 12 మందిలో ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు గుల్లంతు అయ్యారని సమాచారం.

  నిలిచిపోయిన రాకపోకలు

  నిలిచిపోయిన రాకపోకలు

  మిగిలిన వారిని బలగాలు రక్షించాయి. హస్తవరం-నందలూరు మధ్య చెయ్యేరు నదిపై నిర్మించిన చెన్నై-ముంబై ప్రధాన రైల్వే లైన్‌ బ్రిడ్జి, కిలోమీటరు రైలుమార్గం ధ్వంసమయ్యాయి. ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను రేణిగుంట నుంచి రూటు మార్చినట్లు గుంతకల్లు రైల్వే డివిజన్‌ అధికారులు తెలిపారు. రాజంపేట పట్టణ సమీపంలో ఊటుకూరు దగ్గర రోడ్డు కోతకు గురైంది. రైల్వేకోడూరు-ఆంజనేయపురం మధ్య వంతెనకు పెద్ద రంధ్రం పడింది. దీంతో కడప-తిరుపతి వయా రాజంపేట మధ్య రాకపోకలు స్తంభించాయి.

  రంగంలోకి నేవీ బృందం

  రంగంలోకి నేవీ బృందం

  చెయ్యేరు వరద బాధితుల సహాయం కోసం నేవీ బృందం రంగంలోకి దిగింది. వరదల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా రక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు. వరద గ్రామాల్లో ఇళ్లపై ఉన్న బాధితులకు ఆహార పొట్లాలు జారవిడిచారు. చెయ్యేరు వరద సృష్టించిన నష్టంపై సీఎం జగన్‌ కడప జిల్లా కలెక్టరు వి.విజయరామరాజుకు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు.

  వరదలు, వర్షాలకు కడప జిల్లాలో 12 మంది మృతి చెందినట్టు కలెక్టరు పేర్కొన్నారు. పులపుత్తూరులో రెండు, మందపల్లిలో రెండు, రామాపురం ఆర్టీసీ బస్సులో మూడు, అక్కడికి సమీపంలో మరొకరు, గుండ్లూరు శివాలయంలో ఒకటి, మసీదులో ఒకటి, నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లిలో రెండు మృతదేహాలు గుర్తించినట్టు చెబుతున్నారు.

  పూజల్లో ఉన్న సమయంలో గుడిలో వరద

  పూజల్లో ఉన్న సమయంలో గుడిలో వరద

  పులపుత్తూరులోని పురాతన శివాలయానికి కార్తీక పూజల కోసం భక్తులు తెల్లవారుజామునే వెళ్లారు. డ్యాంకట్ట తెగిపోయి శివాలయాన్ని వరద ముంచెత్తే సమయానికి వారంతా పూజల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే గుడి వరద చుట్టేసింది. అప్రమత్తం అయ్యేలోపే పుజారి కుటుంబం సహా భక్తులు గల్లంతయ్యారు. పూజారి కుటుంబంలోనే తొమ్మిదిమంది సభ్యులు ఉన్నారు. ఇక, రాజంపేట మీదగా బస్సలు నిలిపివేసారు. అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసారు.

  English summary
  The Annamayya project dam on the Cheyeru river in Kadapa district has been completely washed away. Flooded many villages. Many lives were lost.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X