Cyclone Arnab: భయంకరమైన తుఫాను.. ఏపీ తీరానికి ఎంత దూరంలో ఉందంటే..

బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఆర్నబ్' తుఫాను అలజడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని వణికించేందుకు సిద్ధమవుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం శనివారం రాత్రికి బలపడి వాయుగుండంగా మారింది. ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 860 కిలోమీటర్లు, కాకినాడకు 950 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,060 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ క్రమంగా ఊపందుకుంటూ మరింత శక్తిని పుంజుకుంటోంది.

27 నాటికి అతి తీవ్ర రూపం.. గంటకు 140 కిలోమీటర్ల వేగం

వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. ఈ వాయుగుండం ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత సోమవారం నాటికి తుఫానుగా మారి, మంగళవారం ఉదయానికల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా విరుచుకుపడే అవకాశం ఉంది. అక్కడక్కడితో ఆగకుండా మరింత బలపడి 'అర్నబ్' అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనుంది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, పీక్ సమయంలో ఏకంగా 140 కిలోమీటర్ల భయంకరమైన వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Severe Cyclone Arnab Threatens Andhra Pradesh Heavy Rainfall and 140 kmph Winds Expected on October 28

బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం!

ఈ భయంకరమైన తుఫాను బుధవారం అక్టోబర్ 28 ఉదయానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి అతి సమీపానికి చేరుకుంటుంది. బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్యలో ఎక్కడో ఒకచోట ఈ తుఫాను తీరాన్ని దాటే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుఫాను తీవ్రతను బట్టి ప్రభుత్వం ఇప్పటికే తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని తీవ్ర అప్రమత్తం చేసింది.

సలసలా మరిగిపోతున్న మహాసముద్రం.. చరిత్రలో తొలిసారి 30 డిగ్రీల వేడి
సలసలా మరిగిపోతున్న మహాసముద్రం.. చరిత్రలో తొలిసారి 30 డిగ్రీల వేడి

12 జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. ఏపీ అంతటా హై అలర్ట్!

తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఏకంగా 12 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 27, 28 తేదీలలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

29 నాటికి కాస్త శాంతించనున్న తుఫాను

తీరం దాటిన తర్వాత తుఫాను తీవ్రత అక్టోబర్ 29 నాటికి కొంతమేర తగ్గే అవకాశముంది. అయినప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఆ రోజు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

Video: తీరాన్ని తాకిన భీకర తుఫాను.. ప్రళయాన్ని తలపించిన సముద్రం
Video: తీరాన్ని తాకిన భీకర తుఫాను.. ప్రళయాన్ని తలపించిన సముద్రం

సీఎం సమీక్ష..

తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ అధికారులతో సీఎం రివ్యూ చేశారు. ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేయడంతో పాటు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉందని, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించేలా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+