భయానకం: సికింద్రాబాద్ నడిరోడ్డుపై తెగిపడిన తల

సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుర్తుతెలియని 30ఏళ్ల వికలాంగుడు ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్‌లో పార్సిల్ కార్యాలయం దగ్గర నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రమాదంలో వ్యక్తి తల, మొండం వేరయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని రిక్షా కార్మికునికి చెప్పారు.
ఒక గుడ్డలో మృతదేహాం భాగాలను మూటగట్టి రిక్షాలో తరలిస్తుండగా ఆకస్మాత్తుగా తల రోడ్డుపై పడింది. కానీ రిక్షా కార్మికుడు ఆస్పత్రికి వచ్చిన తర్వాత గానీ గుర్తించలేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు తల భాగం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గాంధీ ఆస్పత్రి రోడ్ ధర్మ కాంట దగ్గర వ్యక్తి తలను గుర్తించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చాలా మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఎవరో ఆ వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఉంటారని అనుకుంటుండగా వారికి జరిగిన విషయాన్ని పోలీసులు వివరించారు.












Click it and Unblock the Notifications