వీడో రకం సైకో:నగ్నంగా మారి వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తాడు...

అనంతపురం: టెక్నాలజీ మంచి పనులకు ఎంతగా ఉపయోగపడుతుందో...చెడ్డవాళ్ల చేతుల్లో పడితే దాని ఫలితాలు అంత ఇబ్బందికరంగా ఉంటాయనడానికి ఉదాహరణ ఈ ఘటన. చదువుకుంది అంతంతమాత్రమే అయినా మొబైల్ షాపులో పనిచేస్తున్నఅనుభవంతో కొత్త కొత్త యాప్ ల గురించి తెలుసుకున్నాడో కామోన్మాది. ఆ తరువాత ఓ యాప్ ద్వారా వెయ్యిమందికి పైగా అమ్మాయిల వాట్సాప్ నంబర్లు సేకరించి చాలా గలీజ్ పనులే చేశాడీ సైకో...

అమ్మాయిలకు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న లక్ష్మీనారాయణ అనే యువకుడిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇతడిది అనంతపురం జిల్లా నార్సల మండలం నడిమిదొడ్డి గ్రామంగా గుర్తించారు. ఇతడు అమ్మాయిలను వేధించడానికి ఎన్నుకున్న పద్ధతి, టెక్నాలజీని వాడుకున్న తీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ కామాంధుడు ఏమేం చేసాడంటే...

 ఇతడు...ఏం చేస్తాడంటే...

ఇతడు...ఏం చేస్తాడంటే...

అమ్మాయిలకు వాట్సాప్ నంబర్ తెలుసుకుంటాడు...ఆ తరువాత వాళ్లకి మొదట్లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఇంకా మంచి మంచి కొటేషన్లు పెడతాడు...ఎవరైనా స్పందిస్తే మెల్లిగా వాళ్ల వివరాలు తెలుసుకొని ట్రాప్ చెయ్యడానికి చూస్తాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఇతడిలో మరో సైకో యాంగిల్ ఉంది. ముందే నగ్నంగా తయారై కొందరు అమ్మాయిలకు వాట్సాప్ వీడియో కాల్ చేస్తాడు. తన మొహం కనపడకుండా జాగ్రత్త పడుతూ తన శరీరం, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా మాట్లాడుతూ వికృతానందం పొందుతాడు.

ఈ కామోన్మాది...బ్యాక్ గ్రౌండ్...

ఈ కామోన్మాది...బ్యాక్ గ్రౌండ్...

నడిమిదొడ్డి ఎస్సీ కాలనీకి చెందిన ఈ యువకుడు ఇంటర్ మీడియట్ వరకు చదివి నార్సలలోని ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేస్తుండగానే ఫోన్ టెక్నాలజీ, సరి కొత్త ఆప్షన్లు, కొత్త కొత్త యాప్ లు వీటిన్నింటి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. అలా తెలుసుకున్న టెక్నాలజీ, యాప్ ల నాలెడ్జీ తో అమ్మాయిల వాట్సాప్ నంబర్లను సేకరించి ఇక తనలోని కామోన్మాదిని సంతృప్తి పరుచుకునే వికృత చేష్టలు ప్రారంభించాడు.

 అమ్మాయిల వాట్సాప్ నంబర్లు...ఎలా సంపాదించాడంటే....

అమ్మాయిల వాట్సాప్ నంబర్లు...ఎలా సంపాదించాడంటే....

ఆండ్రాయిడ్ ఫోన్లో "వాట్సాప్ రియల్ నంబర్స్" అనే యాప్ ఉంటుంది. ఈ సైకో ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని అందులో నంబర్లన్నీ నోట్ చేసుకున్నాడు. ఆ తరువాత రోజుకు కొన్నినంబర్లకు కాల్ చేసి వారు అమ్మాయిలా కాదా అని చెక్ చేసుకునేవాడు. ఆ తరువాత అమ్మాయిలు అని కన్ ఫర్మ్ చేసుకున్న నంబర్లకు రైట్ మార్క్ ను...అమ్మాయిలు కాకపోతే వారికి ఇంటూ మార్క్ టిక్ పెట్టుకునేవాడు. ఆ తరువాత ఇక ఆ అమ్మాయిల నంబర్లకు వరుసబెట్టి కాల్ చేస్తూ నగ్నంగా మారి తన వికృత చేష్టలతో పైశాచిక ఆనందం పొందేవాడు. అయితే ఇదంతా చేస్తున్నప్పుడు తన మొహం కనపడకుండా జాగ్రత్త పడేవాడు.

 విసిగిపోయిన ఓ యువతి...పోలీసుకు ఫిర్యాదు...

విసిగిపోయిన ఓ యువతి...పోలీసుకు ఫిర్యాదు...

ఇలాగే అనంతపురానికి చెందిన ఓ యువతి మొబైల్ నంబర్ కు వీడియో కాలింగ్ చేసి తన స్వీయ నగ్న చిత్రాలు పంపడం, వీడియోలు పంపుతూ వేధించడం చేశాడు. అలాగే కళ్యాణదుర్గంకు చెందిన మరో యువతికి కూడా ఇలాగే వీడియోలు పంపడం చేశాడట. దీనిపై బాధిత యువతి మహిళా రక్షక్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిఎస్పీ వెంకట్రావు ఇతడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

 ఎలా పట్టుబడ్డాడంటే...వెయ్యికి పైగా అమ్మాయిల నంబర్లు....

ఎలా పట్టుబడ్డాడంటే...వెయ్యికి పైగా అమ్మాయిల నంబర్లు....

వారు కూడా ఇతడు ఏ టెక్నాలజీ అయితే వాడుతూ అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నాడో అదే టెక్నాలజీని వినియోగించి ఇతడు ఎక్కడున్నాడో కనిపెట్టారు. ఇతడు సాయినగర్ స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత నిందితుడి ఇంట్లో చెక్ పోలీసులు అవాక్కయ్యారు. కారణం ఇతడి ఇంట్లో వెయ్యి మందికి పైగా అమ్మాయిల వాట్సాప్ ఫోన్ నంబర్లు ఒక బుక్ లో రాసి ఉండటం...దాన్ని ఇతడు కేటగిరిల విభజించిన తీరు, అందుకోసం కంప్యూటర్ ను వినియోగించడం చూసి ఆశ్చర్యపోయారు. మంగళవారం ఇతడిని మీడియా ముందు హాజరుపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+