అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: కాలేజీ పిల్లలకు అందమైన అమ్మాయిల ఫోటోలు పంపి వ్యభిచారం

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా పామిడి పరిసరాల్లో ఓ దాబాలో వ్యభిచార కార్యకలాపాలు యథేచ్చగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగించారని, ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారిందని అంటున్నారు.

సమీపంలో కాలేజీలు ఉన్నాయి. దీంతో యువతను పెడద్రోవ పట్టిస్తూ కొందరు ఈ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఆ దాబాలో కొంతమంది మహిళలు అందుబాటులో ఉంటున్నారని, దీంతో నిత్యం వ్యభిచారం సాగతోందంటున్నారు.

వాట్సాప్ ద్వారా వ్యాపారం

వాట్సాప్ ద్వారా వ్యాపారం

ఇక్కడ వాట్సాప్ ద్వారా వ్యాపారం నడుస్తోందని, సొమ్మును బట్టి అమ్మాయిలను అందుబాటులోకి తీసుకు వస్తారని చెబుతున్నారు. విటులకు అందమైన అమ్మాయిల ఫోటోలు చూపించి లోబర్చుకుంటున్నారని తెలుస్తోంది.

అందమైన ఫోటోలతో వాటి ధరలు పంపుతూ

అందమైన ఫోటోలతో వాటి ధరలు పంపుతూ

అందమైన ఫోటోలతో పాటు వాటి ధరలను కూడా పంపుతూ గత కొన్నాళ్లుగా వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

పోలీసులు జాగ్రత్తలు

పోలీసులు జాగ్రత్తలు

మరోవైపు, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. ఎవరికైనా ఇలాంటి విషయాలు తెలిస్తే సమాచారం ఇచ్చినా గోప్యంగా ఉంచుతారని చెబుతున్నారని తెలుస్తోంది.

అప్పుడప్పుడు వ్యభిచార ముఠా రట్టు

అప్పుడప్పుడు వ్యభిచార ముఠా రట్టు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడు వ్యభిచార ముఠాల గుట్టు రట్టవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

English summary
It is said that, sex racket running in a Dhaba in Anantapur district Pamidi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X