సెక్స్ రాకెట్‌లో ముగ్గురు యువతులు: ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పోలీసులు బుధవారం రాత్రి ఓ సెక్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ముగ్గురు యువతులను కాపాడారు. ఇందుకు సంబంధించి ముగ్గురు ఆర్గనైజర్లను నగర పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ జోన్ పోలీసులు గురువారం రాత్రి అమీర్‌పేటలోని ఓ భవనం పైన దాడి చేసి.. ముగ్గురిని అరెస్టు చేసి, ముగ్గురు యువతులను రక్షించారు.

యువకుడి దారుణ హత్య

గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఔటర్ రింగు రోడ్డు రహదారి పక్కన పడేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు రహదారి సర్వీస్ రోడ్డు పక్కనే ఆదిభట్ల గ్రామానికి వెళ్లే దారిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.

Sex racket bused, three held

సుమారు 25 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. మృతుడిని గుర్తుపట్టకుండాఉండేందుకు ముఖంపై బండరాళ్లతో మోది రోడ్డు పక్కన పడేశారు. బుధవారం అటుగా వెళ్లిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆధారాలు సేకరించారు.

మరో 17 స్కూళ్లు మూత

రంగారెడ్డి జిల్లాలో అనుమతిలేని పాఠశాలలను మూసివేయించడంలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం మంగళవారం మూసేసిన పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండవ రోజు నిర్వహించిన తనిఖీల్లో 17 పాఠశాలలను మూసి వేయించినట్టు రంగారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి తెలిపారు. అలాగే మంగళవారం మూసివేయించిన 58 పాఠశాలల్లో బుధవారం సీళ్లు తొలగించి తిరిగి పాఠశాలలను ప్రారంభించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+