హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, యువతికి డబ్బు ఆశ చూపి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర పోలీసులు మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. హైదరాబాదులోని బాలానగర్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పక్కా సమాచారం అందడంతో ఓ పోలీసు క్లయింట్‌గా వెళ్లారు. అప్పుడే అతనిని పట్టుకున్నారు.

నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన యువతిని సదరు నిందితుడు డబ్బు ఆశ చూపి వ్యభిచారం రొంపిలోకి దింపాడు.

టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్

Sex racket busted at balanagar in Hyderabad

టాస్క్‌ఫోర్స్ పోలీసులు అధికారినని చెబుతూ స్వర్ణకారుడిని బెదిరించిన వ్యక్తిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి మారెడుపల్లి పోలీసులకు అప్పగించారు. మారేడుపల్లికి చెందిన రమేష్ స్వర్ణకారుడు. మూడేళ్ల క్రితం వెస్ట్ మారేడుపల్లిలో ఉంటున్న సద్గుణ అనే వృద్ధురాలి వద్ద కొత నగదు వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు.

లండన్‌లో ఉంటున్న ఆమె కుమారుడు నాగరాజుకు డబ్బులు అవసరమయ్యాయి. దీంతో తాను ఇచ్చిన డబ్బులు వెంనటే ఇవ్వాలని సద్గుణ కోరింది. అతడు తన వద్ద లేవని చెప్పడంతో ఆమె తన చేతి గాజులను రెండు శాతం వడ్డీకి కుదువపెట్టి రూ.2,15,000 లక్షలు తీసుకొని వచ్చి అందులో కొంత కుమారుడికి పంపించింది.

ఈ విషయంలో సహాయం చేసిన రమేష్‌కు, వృద్ధురాలికి మధ్య తర్వాత ఆర్థిక లావాదేవీలు నడిచాయి. నగరానికి వచ్చిన నాగరాజు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాల్సిన బాధ్యత రమేష్‌దేనని అతడితో బలవంతంగా స్టాంప్ పేపర్ పైన ఒప్పందం రాయించుకున్నాడు.

తాకట్టు పెట్టిన బంగారాన్ని వెంటనే తెచ్చి ఇవ్వాలని రామచంద్రం అనే పేరుతో నాగరాజు స్నేహితుడు సంతోష్ టాస్క్‌ఫోర్స్ ఇన్సుపెక్టర్‌ను అంటూ తరచూ ఫోన్ చేసి రమేష్‌ను బెదిరించాడు. ఈ నెల 18న బాధితుడు టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆశ్రయించాడు. వారు నిందితుడి ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసి సోమవారం రాత్రి పోలీసులకు అప్పగించారు.

English summary
Sex racket busted in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X