సెక్స్‌రాకెట్ గుట్టురట్టు: ముంబై యువతి కేకలు వేయడంతో పట్టేశారు

విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ భారీ సెక్స్ రాకెట్‌ వ్యవహారంపైపోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ: ముంబై, బెంగళూరుల నుంచి యువతులను రప్పించి వారితో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ భారీ సెక్స్ రాకెట్‌ వ్యవహారంపైపోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన దాసరి మేరీ కొంతకాలంగా వ్యభిచార ముఠాను నిర్వహిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ యువతిని బెంగుళూరులో ప్రియ అనే మహిళ ద్వారా ఇటీవల విజయవాడకు తీసుకొచ్చారు.

కాగా తాను ఈ వృత్తి చేయనని, ముంబై వెళ్లిపోతానని.. తనకు భర్త, ఇద్దరు పిల్లలున్నారని ఈ యువతి చెప్పినా.. పట్టించుకోకుండా ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను ఆదివారం కారులో ఎక్కించుకుని రాజమహేంద్రవరం తీసుకువెళుతుండగా ఏలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

sex racket busted in Eluru

ఎలా పట్టుకున్నారంటే..

ముఠా సభ్యులు ఐదు రోజుల ఒప్పందంపై ఈ యువతిని బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. గుడివాడలో రెండు రోజులు ఉంచిన అనంతరం ఆమెను రాజమహేంద్రవరంలో ఓ విటుడి వద్దకు తీసుకువెళ్లేందుకు నిర్వాహకురాలు దాసరి మేరీ, డ్రైవర్‌ కొల్లిపర విజయ్‌కుమార్‌లు ప్రయత్నించారు. ఆమెను ఆదివారం గుడివాడలో కారు ఎక్కించుకోగా ఇంటికి వెళ్లిపోతానని.. తనను వదిలేయమని ఈ యువతి ప్రాధేయపడింది.

అయితే, ఒప్పందం ప్రకారం మరో మూడు రోజులు తమవద్దే ఉండాలని నిర్వాహకులు ఆమెను బలవంతం చేశారు. తాము చెప్పినట్లు వినకుంటే మధ్యలోనే వదిలేస్తామని బెదిరించారు. ఏలూరు కొత్త బస్డాండ్‌ సమీపంలోకి రాగానే ఆ యువతిని బెదిరించాలనే ఉద్దేశంతో ఆమెను కారులో నుంచి దింపేశారు. ఆమె లగేజీ ఇవ్వకుండా ముందుకు వెళ్లి కారును నిలుపుదల చేశారు. దీంతో ఆ యువతి కంగారుపడి తన లగేజీ పట్టుకుపోతున్నారంటూ కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు.

విషయాన్ని పోలీసులకు చెప్పటంతో వారు ఛేజింగ్ చేసి ఆ కారును పట్టుకున్నారు. నిర్వాహకురాలిని, డ్రైవరును, కారును త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించి పూర్తిస్థాయిలో విచారించారు. ఈ ముఠా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా గుడివాడ వన్‌టౌన్‌ ప్రాంతంలో రెండురోజులు ఉన్నట్లు ఆ యువతి చెప్పటంతో ఈ కేసును గుడివాడ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు ఏలూరు నగర సీఐ రాజశేఖర్‌ తెలిపారు. కాగా, ముంబై, బెంగళూరు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి యువతలను రప్పించి వారితో ఇలా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+