సెక్స్ రాకెట్ గుట్టురట్టు: యువతితోపాటు ముగ్గురి అరెస్ట్

Sex racket busted in Hyderabad
హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు పంజాగుట్ట పోలీసులు. ముగ్గురు నిర్వాహకుల తోపాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 3 సెల్‌ఫోన్లు, రూ. 1,000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన సమీరుల్లా ఖాన్, గచ్చిబౌలికి చెందిన మహ్మద్ బాసిత్, మెహిదీపట్నానికి చెందిన జాఫర్‌తో జాఫర్ కలిసి ముఠాను ఏర్పాటు చేశారు.

జల్సాలకు అలవాటు పడ్డ వీరు రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి సెల్‌ఫోన్ల ద్వారా విటులను పిలిపించి యువతులను వారితో పంపించేవారు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి సోమాజిగూడ కెఎఫ్‌సి వద్దకు వారిని ఫోన్ చేసి రప్పించి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

చిన్నారి పట్ల అసభ్య ప్రవర్తన: వ్యక్తి రిమాండ్

నాలుగేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. బన్సీలాల్‌పేటకు చెందిన ఓ బాలిక కవాడిగూడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ప్రతిరోజు ఆ బాలికను ఓ ఆటో డ్రైవర్ పాఠశాలలో వదిలేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో బన్సీలాల్ పేట నుంచి ఆటోలో తీసుకువస్తుండగా ఆటో డ్రైవర్ స్నేహితుడు గణేష్(39) ఆటోలో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని బాలిక కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు పాఠశాల యాజమాన్యం గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు గణేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+