వ్యభిచార ముఠా రట్టు: రేప్ యత్నం, అరవడంతో బిల్డింగ్ నుండి దూకేశాడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయింది. నగరంలోని సనత్ నగర్‌లో నగర పోలీసులు సోమవారం రాత్రి ఓ నివాసం పైన దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్హురు మహిళలు సహా ఓ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

అతను ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన వాడని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు, వ్యభిచారం నిర్వహించేందుకు వినియోగించిన ఇంటిని, అందులోని సామాగ్రిని సీజ్ చేయడం ద్వారా వ్యభిచారానికి చెక్ పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
అత్యాచారానికి యత్నించిన యువకుడికి తగిన శాస్తి
ఓ అపార్ట్‌మెంట్‌లో బాలికపై, యువకుడు అత్యాచారానికి యత్నించాడు. యువకుడి బారి నుంచి తప్పించుకోవడానికి ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో భయపడిన ఆ యువకుడు అపార్ట్‌మెంట్ రెండో అంతస్థు నుంచి దూకేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓంగోలులోని పొనుగోటి మండలంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications