గర్ల్స్‌తో హోటల్లో సెక్స్ రాకెట్, పట్టుబడ్డ ముంబై మోడల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో హోటల్ మేనేజర్ ఉన్నాడు. పోలీసులు ఓ యువతిని ఈ వ్యభిచార కూపం నుండి కాపాడారు. ఆమె వయస్సు 26 వరకు ఉంటుంది. ఆమెను ముంబైకి చెందిన మోడల్‌గా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సెక్స్ వర్కర్‌గా ఆమె ముంబై నుండి హైదరాబాదుకు వచ్చింది.

అనుమానంతో భార్యపై హత్యాయత్నం
అనుమానంతో కట్టుకున్న భార్యపై ఓ భర్త హత్యాయత్నానికి ఒడిగట్టిన సంఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యను చంపేందుకు ప్రయత్నించడంతో పాటు తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. నిజాంపేట గ్రామానికి చెందిన శోభకు తొమ్మిదేళ్ల క్రితం వీరేందర్‌తో వివాహం అయింది. వీరికి ఓ పాప ఉంది.
కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వీరేందర్ శారీరకంగా, మానసికంగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. శనివారం రాత్రి ఆమె నిద్రిస్తున్ సమయంలో కత్తితో దాడి చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయినట్లుగా భావించాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications