2చోట్ల సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు, ముగ్గురు యువతులు
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాదులోని ఓ అపార్టుమెంటులో నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రం పైన ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. వారి నుండి ఐదు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.
ఏసీ గార్డ్స్‌లో కూడా ఓ అపార్టుమెంటులో వ్యభిచార గృహం నడుపుతున్న మహిళను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక అవసరాలు ఉన్న యువతులను గుర్తించి వారితో వ్యభిచార గృహం నడుపుతున్నారు. పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు.

సినీ ఫక్కీలో దోపిడీ
వరంగల్ జిల్లాలో సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది. వరంగల్ జిల్లా జేపీఎం రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంకులో మండిబజార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 4.5 లక్షల రూపాయలను డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న తన బైక్ తీసుకునేందుకు ఆయన వచ్చేసరికి, అక్కడ పది రూపాయల నోట్లు పడి ఉన్నాయి.
పది రూపాయల నోట్లను గమనించిన.. అతను వాటిని తీసుకునేందుకు వంగగా, అదనుకోసం చూసిన దొంగలు అతని దగ్గరున్న నగదు బ్యాగ్ లాక్కుని పారిపోయారు. దీంతో విషయం అర్థం చేసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications