నిరుద్యోగ యువతులే టార్గెట్: తిరుమలలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు, ‘మహిళే బాస్’
చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. తిరుపతిలోని టిటిడి సముదాయాలకు అతి సమీపంలో ఉన్న లాడ్జీలలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు.
తొమ్మిది మందితో కూడిన ఈ ముఠా రహస్యంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వ్యభిచార గృహంపై దాడి చేసి పట్టుకున్నారు.
కాగా, ఈ ముఠా కార్యకలాపాలన్నీ ఓ మహిళ ఆధ్వర్యంలో జరుగుతుండటం గమనార్హం. మరో 8మంది పురుషులు ఆమెకు సహాయకులుగా పని చేస్తున్నారు.

ఒకే ఒక్క మహిళ గత కొన్ని నెలలుగా భక్తులతోపాటు తిరుపతిలోని స్థానికులతో ఈ వ్యభిచారా కూపాన్ని నిర్వహిస్తోంది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతులను మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మరికొంత మంది యువతులు పేదరికం, ఉద్యోగం దొరక్కపోవడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యభిచార గృహం నిర్వాహకురాలు పోలీసులు అదుపులోనే ఉంది. ఈమె మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వ్యభిచార కూపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మిగితా ప్రాంతాల్లోని వారిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్రాలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications