ఎక్కడ?: పేరుకే వైద్య కేంద్రం.. లోపలేమో వ్యభిచారం!

కర్నూలు: నగర శివారులో జరుగుతున్న వ్యభిచారం కూపంపై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పైకి ఆయుర్వేద వైద్య కేంద్రం అని బోర్డు తగిలించి లోపల మాత్రం వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తుండగటంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, తమకు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు ఈ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు.

ఆ వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరానికి చెందిన రమాదేవి మొదట స్టాఫ్ నర్సుగా పని చేసేది. ఆ తర్వాత ఆమె భర్త చనిపోవడంతో వైద్యంలో అనుభవం ఉన్న ఆమె.. ఆయుర్వేద మందుల వైపు దృష్టి సారించింది. ఆయుర్వేద మందులు ఇస్తాననని చెప్పి యెల్కూరు ఎస్టేట్‌లో ఏడాది క్రితం ఇల్లు అద్దెకు తీసుకుంది. నెలకు రూ.7 వేలకు పైగా అద్దె చెల్లిస్తోంది. యజమానే తరచూ వచ్చి అద్దె తీసుకెళ్లేవారు.

కాగా, ఆరు నెలల క్రితం హైదరాబాదుకు చెందిన తన స్నేహితురాలి సలహాతో రమాదేవి వ్యభిచారంలోకి అడు గుపెట్టింది. స్నేహితురాలి ద్వారా యువతులను రప్పిస్తుండేది. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు నుంచి ఫోన్‌ల ద్వారానే ఈ తతంగమంతా నడిపించేది. యువతులకు రూ.7 వేల నుంచి రూ. 8 వేల దాకా చెల్లిస్తుందని సమాచారం. ఒక్కో విటుడి నుంచి రూ. 1000 నుంచి రూ. 2000 దాకా వసూలు చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒకసారి ఇక్కడికి వచ్చిన యువతులు వారం దాకా ఉంటారు.

sec- rocket

తన వద్దకు వచ్చిన విటుల ద్వారా వారి మిత్రులకు గాలం వేసేది రమాదేవి. ఈమె దగ్గరికి వెళ్లే విటులే కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. గత మంగళవారం రాత్రి సీఐ మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా కానిస్టేభుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు దాడులు చేశారు. కాగా, పోలీసులు వచ్చినప్పుడు రమాదేవి దొరికిపోయింది. ఆమెతోపాటు మరో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకోగా.. అప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు విటులు వెనుక వైపు నుంచి పరారయ్యారు.

కాగా, యువతులను సంక్షేమ గృహానికి తరలించారు. గతంలో కూడా నగరంలో పలు వ్యభిచార గృహాలపై దాడి చేసిన పోలీసులు.. నిర్వాహకులతోపాటు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొందరు పోలీస్ కానిస్టేబుళ్లు వ్యభిచార నిర్వాహకులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో వ్యభిచార కార్యకలాపాలు నగరంలో పెరిగిపోయాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు గట్టి నిఘావేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు యజమానులు వారి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే అద్దెకివ్వాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+