యజమాని కూతురిపై లైంగిక దాడి: అసభ్యంగా ప్రవర్తించి షీ టీమ్స్‌కు చిక్కిన ఆటో డ్రైవర్
హైదరాబాద్: యజమాని కూతురిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడి చేసిన యువకుడిని పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ రాంమోహన్‌రెడ్డి కథనం ప్రకారం.. గోల్నాకలో బుక్ బైండింగ్ ప్రెస్‌ను నడుపుతున్న ఓ వ్యక్తి వద్ద పాత్లవత్ సురేష్ పనిచేస్తున్నాడు.
కొంతకాలంగా ప్రేమిస్తున్నంటూ యజమాని కూతురు వెంటబడుతున్నాడు. గత నెల 12న వెంట తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు అదే నెల 27న అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను షీ టీమ్స్ అరెస్టు చేశాయి. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ టీమ్స్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. నగర అదనపు కమిషనర్ స్వాతీ లక్రా కథనం ప్రకారం - రామంతాపూర్‌కు చెందిన మేడబోయిన రాములు ఆటో డ్రైవర్.

సికింద్రాబాదులోని లోత్‌కుంటకు చెందిన ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగాఆటో కావాలా అని అడిగాడు. ఆమె వద్దంటూ చెప్పి ముందుకు వెళ్లింది. వెనకాలే వచ్చిన అతను ఈవ్‌టీజింగ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
జరిగిన విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. ఆయన వెంటనే షీ టీమ్స్ ఫేస్‌బుక్ పేజీలో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆటో నెంబర్ సహాయంతో రాములును గుర్తించి అదుపులోకి తీసుకొని తుకారంగేట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications