విద్యార్థులపై టీచర్ అఘాయిత్యం: లేడీ లాయర్ హత్య

Sexual assault against students: lady lawyer killed
నెల్లూరు/ గుంటూరు: విద్యార్థినుల పట్ల అఘాయిత్యానికి పాల్పడిన ఓ ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. మానసిక వికలాంగులైన చిన్నారులపై గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పిల్లల తల్లిదండ్రులు నెల్లూరు నగర 5వ పట్టణ పోలీసు స్టేషనువద్ద గురువారం ఆందోళన చేపట్టారు. మానసక వికలాంగులైన పలువురు విద్యార్థులు నెల్లూరులోని ప్రగతి చారిటబుల్ ట్రస్టులో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు.

ఎప్పటిలాగే ఉదయం బడికి వెళ్లిన తమ పాప భయభ్రాంతులతో ఇంటికి తిరిగి రావటంతో తల్లిదండ్రులు ఏమి జరిగిందని తమ కుమార్తెను అడిగారు. దీంతో ఆమె బడిలో టీచరు అరవ పాల్ భాస్కర్ తనపై అసభ్యంగా ప్రవరిస్తున్నాడని తెలిపింది. వెంటనే బడి వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీయగా ఈ విషయంపై తమకేమి తెలియదంటూ వారు తప్పించుకోడానికి యత్నించారు.

విద్యార్థిని తల్లిదండ్రులు టీచర్ ఉపాధ్యాయుడి ఐదో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితం ఉపాధ్యాయుడుగా నియమితుడైన అరవ పాల్ భాస్కర్ బడికి వచ్చే చిన్నారులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నాడని బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణచేసిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వైవి సోమయ్య తెలిపారు.

మహిళా న్యాయవాది హత్య

గుంటూరుకు చెందిన మహిళా న్యాయవాది రాచాబత్తుని సీతామహాలక్ష్మి (44)ని ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన బకాయి విషయంలో బిల్డర్ హత్య చేసినట్లు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానిక బ్రాడీపేట 3/1లో గండికోట సుబ్బారావు అనే బిల్డర్ గండికోట అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఏడాదిన్నర క్రితం 26.50 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుని సీతామహాలక్ష్మి కుటుంబం అందులో నివాసం ఉంటున్నారు.

పూర్తి మొత్తం చెల్లించలేదని బిల్డర్ పలుసార్లు ఆమెతో వాగ్వాదానికి దిగారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా ఫ్లాట్‌ను ఖాళీచేయాలంటూ సుబ్బారావు సీతామహాలక్ష్మితో గొడవకు దిగారు. ఈ గొడవలో ఆమె గొంతు కోసి హతమార్చిన సుబ్బారావు అరండల్‌పేట పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+