బీటెక్ మాయగాడు: షార్ట్ ఫిల్మ్ పేరుతో యువతులు దుస్తులు మార్చుకుంటుంటే..
సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ పలువురు యువతులను మోసగించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని మంగళవారం కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం: చేసేది బీటెక్ అయినా.. మోసాలు చేయడంతో మాత్రం ఆరితేరిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ పలువురు యువతులను మోసగించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని మంగళవారం కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలేనికి చెందిన వైడా నిఖిల్ (24) విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. అతడు షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తుంటాడు. ఆరు నెలల కిందట ఫేక్‌బుక్ ద్వారా పలువురు యువతులతో పరిచయం పెంచుకుని సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ నమ్మించాడు. అనంతరం వారిని కెమెరా టెస్టింగ్, స్టిల్‌ఫొటోలు అంటూ పిలిచేవాడు.

అయితే, ఆ యువతులు గదిలో దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫొటోలు తీసి వారిని వివిధ రకాలుగా బెదిరించేవాడు. ఆ తర్వాత పలువురు యువతులను లోబర్చుకున్నాడు. నిఖిల్ మాటలకు మోసపోయిన ఓ యువతి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు తాము కూడా నిఖిల్ చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. కాగా, తనను నిఖిల్ వివాహం కూడా చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ముగ్గురిలో ఓ యువతి తెలిపింది. చాలా మంది యువతులను ఇలాగే మోసం చేశాడని నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసును కంచరపాలెం సీఐ చంద్రశేఖరరావు దర్యాప్తు చేస్తున్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications