వివాహితతో అసభ్య ప్రవర్తన: కాపీ కొడుతూ దొరికి.. చేయి కోసుకుంది
ఖమ్మం: పాల్వంచ కెటిపిఎస్ కాలనీలో బాకీ వసూలుకు వెళ్లిన ఓ ప్రబుద్ధుడు వివాహితతో అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. పట్టణంలోని బంగారం షాపు యజమాని సోమవారం ఉదయం బాకీ వసూలు చేసేందుకు ఓ ఇంటికి వెళ్లాడు.
అక్కడ ఇంటి యజమానురాలు ఒంటరిగా ఉండటంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
కాపీ కొడుతూూ దొరికి.. చేయి కోసుకుంది

ఖమ్మం జిల్లాలోని దమ్మపేటలోని ఇంటర్ పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని మందలించినందుకు చేయికోసుకోబోయింది. కాపీ కొడుతున్న ఓ విద్యార్థిని ఇన్విజిలేటర్ గమనించి మందలించారు. దీంతో ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకునేందుకు యత్నించడంతో అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు.
కుటుంబకలహాలు: వ్యక్తి ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం అమడబాకంలో హమాలీగా పనిచేస్తున్న గొల్ల రాములు (42) ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి గత కొంత కాలంగా మతిస్థిమితం లేదని, దీనికితోడు కుటుంబ కలహాలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications