గుండు గీయిస్తా, భార్యనే కంట్రోల్లో లేదు: పవన్‌పై షబ్బీర్

కాంగ్రెస్ హఠావో దేశ బచావో అనడం కాదని, ముందు నీ ఇంటిని సరిదిద్ధుకో అని సూచించారు. ఇంట్లో భార్యను కంట్రోల్ చేయలేని వాడు రాజకీయాల్లో సమాజాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పాలని నిలదీశారు. గబ్బర్ సింగ్ నువ్వో నేనో తేల్చుకుందామని షబ్బీర్ అలీ సవాలు విసిరారు. పవన్ క్యారెక్టర్ లేని వ్యక్తి అని దుయ్యబట్టారు. జనసేనకు ఆదరణ ఉండదన్నారు. పవన్ వంటి వ్యక్తి సామాజిక తెలంగాణ ఎలా తెస్తాడన్నారు.
పొన్నాలతో సారయ్య, దుగ్యాల భేటీ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో మాజీ మంత్రి సారయ్య, దుగ్యాల గురువారం ఉదయం సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలోని ఓ కీలక నేత కాంగ్రెస్‌లో చేరే అంశంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటమి భయం: కొణతాల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని జగన్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. అందువల్లే రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా అన్ని పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications