అద్వానీ పాక్‌లో పుట్టలేదా: సానియాపై షబ్బీర్ అలీ

Shabbir condemns VH comments on Sania
హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. వి. హనుమంతరావు మతతత్వ పార్టీ నాయకుల మాదిరిగా మాట్లాడుతున్నారని, విహెచ్ వ్యాఖ్యలు బిజెపిని సమర్థించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు.

విహెచ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సానియాను విహెచ్ పాకిస్తాన్ కోడలు అని వ్యాఖ్యానించడం అర్థం లేనిదని ఆయన అన్నారు.

సానియా మీర్జా స్థానికతపై వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని, సానియా మీర్జా ముంబైలో పుట్టినప్పటికీ తెలంగాణకు చెందినవారేనని, ఆమె తల్లికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరం కావడంతో సానియాకు ముంబైలో జన్మనివ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ పాకిస్తాన్‌లో జన్మించారని, అంత మాత్రాన అద్వానీని పాకిస్తానీ అని అనలేమని ఆయన అన్నారు. సానియాకు కూడా అదే సూత్రం వర్తిస్తుందని, పాకిస్తానీని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమె పాకిస్తానీ కాలేదని ఆయన అన్నారు.

సానియాపై చేసిన వ్యాఖ్యలు విహెచ్ స్థాయికి తగినవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశాలపై, ముఖ్యంగా మైనారిటీల విషయంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+