జనసేన కోసం సర్వస్వం ధారపోశా..తిరిగి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు - జబర్దస్త్ నటుడు
ప్రముఖ జబర్దస్త్ నటుడు షకలక శంకర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు.జనసేన పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు చేయగా భార్య అలిగి మాట్లాడలేదట. నువ్వు ఇంత చేస్తే తిరిగి పవన్ కళ్యాణ్ ఏం చేశాడని తన బంధువులు ప్రశ్నించారని షకలక శంకర్ వాపోయారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో షకలక శంకర్ కూడా ఒకరు. జబర్దస్త్ స్కిట్‌ల్లో,తన సినిమాల్లో పవన్ కల్యాణ్ మ్యానరిజంతో షకలక శంకర్ నటిస్తుంటారు.
అవకాశం దొరికినప్పుడల్లా కూడా పవన్‌పై తనకున్న అభిమానాన్ని బయటపెడుతూనే ఉంటారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి సెలబ్రిటీలు ప్రచారం చేశారు కానీ..2019 ఎన్నికల్లో షకలక శంకర్ ఒక్కరే పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన పవన్ గెలవడానికి తనవంతు ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా షకలక శంకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. షకలక శంకర్ మాట్లాడుతూ.. 2019ఎన్నికల్లో సొంత ఖర్చులతో జనసేన తరపున ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు.

జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు రూ. 3 లక్షలతో భోజనాలు పెట్టించానని షకలక శంకర్ తెలిపారు. దీంతో చేతిలో ఉన్న డబ్బంతా ఆవిరి అయిపోయింది. కొత్త సినిమాలు ఒప్పుకున్నానని అడ్వాన్సుసులు వచ్చాయ ని ఇంట్లో వాళ్లతో చెప్పాను. వాళ్ళు నేను డబ్బులు తీసుకొస్తున్నాని అనుకున్నారు. తీరా చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరికి మా ఫ్రెండ్ తో వెయ్యి రూపాయల డీజిల్ కొట్టించుకొని ఇంటికి వచ్చాను. డబ్బులు ఖర్చు చేశానని మా ఆవిడ నాలుగు రోజులు మాట్లాడలేదు. ఈ సమయంలో మా మామయ్య అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదని షకలక శంకర్ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ పై ప్రేమతో ఇంత చేశావు... ఆయన కనీసం నీకు ఫోన్ చేశాడా? తిరిగి నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడని మా మామయ్య ప్రశ్నించారు. అవును నిజమే కదా అనిపించింది. నేను ఎక్కడో శ్రీకాకుళంలో చేస్తే ఆయనకు తెలుస్తుందా? అనుకున్నాను. ఒకవేళ తెలిసి కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చనే ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications