షకీరా స్పైసీ కనువిందు: విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ ఎలా ఉండబోతోంది?

విశాఖపట్నం: విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిర్ణయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దుమ్మెత్తిపోస్తోంది. మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ బీచ్ లవ్ ఫెస్టివల్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఫెస్టివల్‌లో ప్రముఖ పాప్ స్టార్ షకీరా తన అందాలతో కను విందు చేయబోతోందని చెబుతున్నారు.

విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. షకీరా మూడు రోజుల పాటు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చే అవకాశం ఉంది. ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ ఈ ఫెస్టివల్‌ను నిర్వహించబోతోంది. ఈ ఉత్సవాన్ని ఆనందోల్లాసాల మధ్య నిర్వహించేందుకు అవసరమైన పది ఎకరాల భూమిని సేకరించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలను, సాగరనగర్‌ను, తోట్లను సందర్శించారు.

 Shakeera to spice up Vizag Beach Love Festival

ఎవరీ షకీరా...

షకీరా ఇసాబెల్ మెబారక్ రిపోల్ కొలంబియా గాయకురాలు, నాట్యకత్తె, రికార్డు ప్రొడ్యూర్. రాక్ అండ్ రోల్, బెల్లీ డ్యాన్సింగ్‌లకు ఆమె ప్రఖ్యాతి వహించారు. 2010 ఫిఫా వరల్డ్ కప్ అధికారిక గేయాన్ని వకా, వకాను ఆెమె ఆలపించింది. అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో అమ్ముడైన గేయంగా రికార్డు సృష్టించింది.

ఆమెకు ఐదు ఎంటివీ మ్యూజిక్ అవార్డులు, రెండు గ్రామీ అవార్డులు లభించాయి. ప్రపంచం మొత్తం నుంచి వచ్చే 9 వేల జంటలు ఆమెతో పాటు ఆడుతూ పాడుతారని చెబుతున్నారు. భాగస్వామ్య సదస్సు - 2 ముగిసిన వెంటనే ఈ విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది.

ఈ ఫెస్టివల్‌ను ఆంధ్రప్రదేశ్ యువజన వ్యవహారాలు, పర్యాటక శాఖలు, విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

అందాల పోటీలు కూడా..

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సింగర్స్ రాక్ షోలు ఇస్తారు. పుడ్ ఫెస్టివల్, అందాల పోటీలు ఉంటాయి. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ ప్రదర్శనలు కూడా ఉంటాయి. వీరు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తారు. ఈ బీచ్ లవ్ ఫెస్టివల్‌తో విశాఖ నగరం ముఖ చిత్రమే మారిపోతుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+