ఊపిరి తీసుకోవద్దంటారా - దీనికి అయినా ఓకేనా : వైసీపీకి పవన్ కౌంటర్..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఈ సారి ప్రభుత్వానికి సీరియస్ ప్రశ్నలు సంధించారు. వరుసగా జరగుతున్న పరిణామాలు..తనను కట్టడి చేసే ప్రయత్నాల పైన వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. తాజాగా పవన్ కల్యాణ్ తన ప్రచారం కోసం సిద్దం చేసుకున్న వారాహి వాహనం పైన తాజాగా కొత్త చర్చ మొదలైంది. ఈ వారాహి వాహనం కోసం వినియోగించిన రంగు సాధారణ వ్యక్తులు వినియోగించే అంశం పైన అభ్యంతరాలు ఉన్నాయనేది ఈ చర్చ సారాంశం. దీని పైన జనసేన నేత నాదెండ్ల స్పందించారు. తాజాగా.. పవన్ కల్యాణ చేసిన ట్వీట్ తో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.
వారాహి పై కొత్త వివాదం..
పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార రధం వారాహి పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ వాహనం లో అనేక సౌకర్యాలు కల్పించారు. శక్తిస్వరూపిణి అమ్మవారి పేరు వారాహి పేరును ఈ వాహనం కు ఖరారు చేసారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేయించి ఈ వాహనాన్ని వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. పవన్ కల్యాణ్ వాహనం కు వినియోగించిన రంగు పైన చర్చ మొదలైంది. దీని పైన మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆలీవ్ గ్రీన్ కంటే.. పసుపు రంగు వేసుకుంటే మంచిది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జనసేన బండి.. తెలంగాణలో కూడా నడవదని, అందుకే ఆ వాహనానికి పసుపు రంగు వేసుకుంటే బెటర్ అని చెప్పుకొచ్చారు.
ఊపిరి తీసుకోవద్దంటారా ..?? నెక్స్ట్
దీని పైన జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. నిబంధనలు తెలియకుండానే అనుమతి వస్తుందా అని ప్రశ్నించారు. ఈ వివాదం పైన స్పందించిన జనసేనాని పవన్ ఒక ట్వీట్ చేసారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. 'మొదట మీరు నా సినిమాలను అడ్డుకున్నారు. ఆ తరువాత విశాఖపట్నం పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా నా కారును అడ్డగించారు. కనీసం నడిచి వెళ్దామంటే నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది. తర్వాత నన్ను ఊపిరి కూడా తీసుకోవద్దంటారా చెప్పండి..నెక్స్ట్ అంటూ పోస్టు చేసారు. వైసీపీ నేతలు ఈ వాహనం రంగు పైన మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు. కేవలం ఆర్మీకి చెందిన వాహనాలు మాత్రమే ఈ ఆలివ్ గ్రీన్ రంగు వినియోగించాలని చెప్పుకొచ్చారు. దీని పైనే ఇప్పుడు పవన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆలివ్ గ్రీన్ షర్టు ఫొటోతో..వైసీపీకి కౌంటర్
వైసీపీ నేతల సెటైర్ల పైన పవన్ వరుస ట్వీట్లు చేసారు. ఆలివ్ గ్రీన్ రంగు తన ప్రచార రధానికి వేయటం పైన వైసీపీ నేతల కామెంట్స్ కు మరో సారి కౌంటర్ ఇచ్చారు. ఈ సారి పవన్ తన ట్వీట్ లో ఆలివ్ గ్రీన్ షర్టును పోస్టు చేసారు. కనీసం ఈ ఆలీవ్ కలర్ షర్ట్ అయినా వేసుకోవచ్చా..అంటూ ప్రశ్నించారు. పవన్ తన ఎన్నికల ప్రచారంలో ఇదే షర్టుతో రానున్నట్లు సింబాలిక్ గా ఈ ట్వీట్ ద్వారా వెల్లడించినట్లు విశ్లేషణలు మోదలయ్యాయి. అయితే, ఇప్పుడు వైసీపీ నేతల వ్యాఖ్యల పైన పవన్ చేసిన ట్వీట్లు మరోసారి రాజకీయంగా చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. పవన్ ట్వీట్ల పైన ఇప్పుడు వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications