వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిచ్చోడి చేతిలో: కిరణ్‌పై శంకరన్న, ఉల్లి గిఫ్ట్ ఇచ్చేందుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిచ్చోడి చేతిలో రాయిలా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు మండిపడ్డారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమాధి కట్టిన వారి పైన చర్యలేం తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

తాను తెలుగువాడినని చెప్పుకునేందుకు కిరణ్ అర్డుడు కాదన్నారు. తెలుగు సరిగా రాని ఆయన తెలుగు గురించి మాట్లాడితే ఎలా అన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన కిరణ్ ఇప్పుడు ఇలా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. సోనియాను ద్రోహిలా చిత్రీకరించే ఉద్దేశ్యంతోనే కిరణ్ అలా మాట్లాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పార్టీకి వ్యతిరేకంగా..

పయ్యావుల కేశవ్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన తీరుపై మరోసారి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించనున్నట్లు తెలిపారు. అఖిలపక్ష సమావేశంపై ఎల్లుండి చర్చలు జరుపనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉండేలా చంద్రబాబు ఒప్పిస్తామన్నారు.

ముఖ్యమంత్రికి ఉల్లిగడ్డలు బహూకరించే యత్నం

ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటిని ముఖ్యమంత్రికి దీపావళి కానుకగా బహూకరించేందుకు బిజెవైఎం ప్రయత్నించింది. శుక్రవారం సాయంత్రం క్యాంపు ఆఫీసుకు వెళ్లిన నాయకులు లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకొని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

English summary
Shankar Rao blames Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X