సోనియాకు శంకర్రావు గుడి, కూల్చేస్తామని బిజెపి వార్న్
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గుడి కడుతున్నానని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యులు శంకర రావు సోమవారం చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలో సోనియాకు గుడి కట్టేందుకు శంకర రావు నిర్ణయించుకున్నారు.
సోమవారం సోనియా పుట్టిన రోజు కావడంతో సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ తల్లి మహాక్షేత్రం, సోనియా గాంధీ శాంతివనం పేరుతో ఆయన గుడిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

సోనియా గాంధీ త్యాగాల కుటుంబం నుండి వచ్చారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని శంకర రావు అన్నారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను సీమాంధ్రలో కూల్చడం దారుణమన్నారు. సీమాంధ్రులు చరిత్రహీనులుగా మారటం ఖాయమన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్థానిక నేతల వైఫల్యమే అన్నారు. ఎపిలో కాంగ్రెసు పార్టీ క్యాడర్ అలాగే ఉందన్నారు.
కూల్చేస్తామని బిజెపి
సోనియా గాంధీకి గుడి కడితే తాము కూల్చివేస్తామని స్థానిక బిజెపి నాయకులు హెచ్చరించారు. నందిగామలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తెలంగాణ విద్యార్థుల చావుకు కారణం సోనియానే అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి గుడి కట్టడం దారుణమన్నారు. దేశమంతా సోనియా, కాంగ్రెసును వ్యతిరేకిస్తుంటే, గుడి ఎలా కడతారని ప్రశ్నించారు. తాము దానిని కూల్చేస్తామని హెచ్చరించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications