షిర్డీ సాయిబాబాపై వ్యాఖ్యలు: వెనక్కి తగ్గని శంకరాచార్య

ప్రజలకు ఎవరిని కావాలంటే వారిని కొలుచుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నప్పటికీ సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తాము కేవలం ఐదుగురు దేవుళ్లనే ఆమోదిస్తామని, వేరే ఎవరైనా తమను తాము అక్కడ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆమోదించేది లేదని తెలిపారు.
కాంగ్రెస్ ప్రోద్బలంతోనే తాను సాయిబాబాపై గళమెత్తానన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తాను రాజకీయవాదిని కానని స్పష్టం చేశారు. మరోవైపు నాగా సాధువులు కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచారు. శంకరాచార్యను ఎవరైనా అవమానిస్తే తాము వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ అంశాన్ని వారు ఆధ్యాత్మిక యుద్ధంగా కూడా చెప్పారు.
ఇదిలావుంటే, శంకరాచార్య స్వరూపానందపై ఓ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం నమోదైంది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications