కేసీఆర్‌తో షాపూర్ జీ పాలంజీ ప్రతినిధులు భేటీ, వైఫై సేవలను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గురువారం సాయంత్రం షాపూర్ జీ పాలంజీ కంపెనీ చైర్మన్ షాపూర్ మిస్త్రీ కలిశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన షాపూర్ జీ పాలంజీ కంపెనీ హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, సపరేటర్లు, ఇతర నిర్మాణాల కోసం రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, పారిశ్రామిక విధానాన్ని కంపెనీ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్

సీఎం కేసీఆర్‌‌తో ఎమ్ఆర్ఎఫ్ ప్రతినిధులు భేటీ

గురువారం నాడు సీఎం కేసీఆర్‌తో సచివాలయంలో ఎమ్ఆర్ఎఫ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. త్వరలో రాష్ట్రంలో రూ. 980 కోట్లతో ఎమ్ఆర్ఎఫ్‌ను విస్తరిస్తామన్నారు. దీంతో అదనంగా 905 మందికి ఉపాధిని కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పరిశ్రమలకు విద్యుత్ కోతలుండవని చెప్పారు. ప్యాక్టరీలకు, పరిశ్రమలకు అవసరమైన నీరు సరఫరా చేస్తామని అన్నారు. త్వరలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయి విధాన ప్రకటన చేస్తామని అన్నారు. పరిశ్రమల స్ధాపన తెలంగాణ రాష్ట్ర హక్కుగా భావిస్తున్నామని చెప్పారు.

వైఫై సేవలను ప్రారంభించిన కేటీఆర్

తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని హోటల్ మారియట్‌లో వైపై సేవలను ప్రారంభించారు. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి క్వాడ్ జెన్ కంపెనీ ఈ సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ హైదరబాద్ భారతీయ ఐటీ పరిశ్రమలో ముఖ్య భాగమని అన్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో వైఫై సేవలు అందించడం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.

మొదటిదశలో భాగంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ వైఫై సేవలు అందించనున్నారు. ఇందులో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని ట్యాంక్ బండ్, లుంబినీ పార్కు, నెక్లెస్‌రోడ్ చుట్టూ 10 కిలో మీటర్ల పరిధిలో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+