తెలంగాణ బాధ్యత షర్మిలకి, ఎల్లుండి చంద్రబాబు రోడ్డు షో

Sharmila may campaign in Telangana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ప్రచార బాధ్యతలను తన సోదరి షర్మిల పైన పెట్టారట. తెలంగాణ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ తెలంగాణ ప్రాంతంలో చాలామంది అభ్యర్థులను బరిలో నిలిపింది.

ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులలో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు వైయస్ కుటుంబం నుండి ఎవరో ఒకరు కచ్చితంగా ప్రచారంలో పాల్గొనాలని తెలంగాణ ప్రాంత నేతల నుండి మొదటి నుండి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వరకు షర్మిలకు బాధ్యతలు అప్పగించారట.

త్వరలో ఆమె తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారని అంటున్నారు. అయితే, గెలుపు అవకాశాలు, బలమైన అభ్యర్థులు ఉన్న చోట మాత్రమే ఆమె పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. విజయమ్మ, జగన్ పూర్తిగా సీమాంధ్రకే పరిమితం కానున్నారని అంటున్నారు.

ఇప్పటికే ఖమ్మంలో ఖమ్మం లోకసభ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరఫున వైయస్ జగన్ ఓసారి ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయన దృష్టి అంతా ప్రధానంగా సీమాంధ్ర పైనే ఉంది.

ఎల్లుండి మల్కాజిగిరిలో బాబు రోడ్డు షో

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎల్లుండి మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్డు షో చేపట్టనున్నారు. తద్వారా ఎల్లుండి నుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+