హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను కల్సిన షర్మిల, దీక్ష భగ్నం దురదృష్టం: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila meets YS Jagan
హైదరాబాద్: నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన సోదరి షర్మిల గురువారం పరామర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జగన్ శనివారం నుండి లోటస్ పాండులో ఆమరణ నిరాహార దీక్ష చేయగా బుధవారం రాత్రి పదకొండు గంటలకు పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.

జగన్ సతీమణి వైయస్ భారతి కూడా ఆయనను కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... జగన్‌కు రాత్రి ఫ్లూయిడ్స్ ఎక్కించారని చెప్పారు. రక్త పరీక్షల కోసం మరోసారి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారన్నారు.

దేశ భద్రత గురించి తెలియదు: అంబటి

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడం దురదృష్టకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వేరుగా అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి దేశభద్రత గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు దీక్ష చేస్తన్నారో స్పష్టత లేదని, ఆయన ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఎపి భవన్.. ఆంధ్ర భవన్‌గా: దేవిప్రసాద్

బాబు దీక్ష చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని టిఎన్జీవో నేత దేవిప్రసాద్ కరీంనగర్‌లో అన్నారు. ఎపి భవన్ ఆంధ్రా భవన్‌గా మారిందన్నారు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షవాతం వచ్చిందని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. జివోఎం కమిటీ అస్పష్టంగా ఉందన్నారు. నివేదికకు నిర్ణీత గడువు విధించాలని, మాజీ డిజిపి దినేష్ రెడ్డి వ్యాఖ్యల పైన న్యాయవిచారణ జరిపించాలన్నారు.

English summary
YSR Congress Party leader Sharmila met party chief YS Jaganmohan Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X