ఆనం బ్రదర్స్‌కు షాక్: జగన్ పార్టీలోకి సోదరుడు విజయకుమార్ రెడ్డి

నెల్లూరు: ఆనం కుటుంబంలో రాజకీయ విభేదాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి నెల్లూరు రూరల్‌ మండలంలో వెన్నెముకలా ఉన్న ఆయన సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు.

వైసిపి ఎమ్మెల్యేలు శనివారం విజయకుమార్‌రెడ్డి నివాస ప్రాంతం చింతారెడ్డిపాలెం చేరుకుని మంతనాలు సాగించారు. విజయకుమార్‌రెడ్డి చేరిక దాదాపు లాంఛనమైనట్లుగా భేటీ అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు.

విజయకుమార్‌ రాకను ఇప్పటికే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డిల దృష్టికి తీసుకెళ్లామని, వారు సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రజల్లో పట్టున్న నేతలను చేర్చుకుంటున్నట్టు చెప్పారు. ఆనం విజయకుమార్‌రెడ్డి తనకు అన్నతో సమానమని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

shck to Anam brothers: Vijayakumar reddy joins in YCP

తాను వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఆనం విజయకుమార్‌రెడ్డి చెప్పా రు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ఆహ్వానాన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ కార్యాకర్తలతో మరోసారి సంప్రదించి అధికారికంగా చేరేందుకు తుది గడువు త్వరలో ప్రకటిస్తానన్నారు.

అనంతరం ఆనం విజయకుమార్‌రెడ్డితో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు నెల్లూరు ఎంపీ మేకపాటి నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్‌, సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రూప్‌కుమార్‌ యాదవ్‌, బొబ్బల శ్రీనివాస్ యాదవ్‌ తదితరులు విజయకుమార్‌ వెంట ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+