ఆలీ ప్ర‌త్య‌ర్థి ఆవిడే..! ర‌స‌వ‌త్త‌రంగా మారిన బెజ‌వాడ రాజ‌కీయం..!!

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ఊహించని రీతిలో సినీ న‌టుడు ఆలీ వైసీపీ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గ‌తంలో టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయాలని అలీ ఆశించారు. ఈ విషయంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే ఆయన వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే అలీని గుంటూరు సిటీ నుండి బరిలోకి దింపాలని టీడీపీ భావించింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అలీతో చర్చించారు. కానీ, ఆ సమయంలో పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. దీనికి కారణం ఆయన రాజమండ్రి టికెట్ అడగడమేనని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఇదిలా ఉండ‌గా వైసీపీ తరఫున అలీ, గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆలీ విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ వైసీపీ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పుడు అలీ చేరికతో ఆయనను తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

She is the Alis opponent candidate..! Bezwada Politics became hot..!

ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జలీల్ ఖాన్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి జలీల్ ఖాన్ కుమార్తెకు సీటు ఖరారు అయింది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక ఆలీ పోటీ చేయ‌బోయే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి ఈవిడే అని తెలియ‌డంతో బెజ‌వాడ రాజ‌కీయం ఒక్క సారిగా వేడెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+