శిల్పాకు షాక్: అఖిలప్రియకు జోష్, టిడిపిలో చేరిన కరీం

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ సీటు ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరుడు, మైనార్టీ నాయకుడు కరీం టీడీపీలో చేరారు. గత 15 ఏళ్లుగా శిల్పా మోహన్‌రెడ్డి వెంట ఉంటూ వస్తున్నారు.

ఆ రకంగా కరీం నంద్యాల రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈనెల 3వ తేదీన నంద్యాల ఎస్‌పీజీ హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో జగన్‌ సమక్షంలో శిల్పా మోహన్‌రెడ్డి కరీం పాత్ర గురించి మాట్లాడారు. కరీం భాయ్ వంటి వారు తన విజయంలో కీలకపాత్ర పోషించబోతున్నారని చెప్పారు.

ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయగలిగేవారిలో కరీం ముఖ్యమైన నాయకుడిగా పేరు పొందారు. నంద్యాల కూరగాయల మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడిగా వందల మంది వర్తకుల నాయకుడిగా ఆయకు గుర్తింపు ఉంది. ఆయన టీడీపీలో చేరడం శిల్పాకు షాక్‌ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

శిల్పా మోహన్ రెడ్డిపై ఇలా..

శిల్పా మోహన్ రెడ్డిపై ఇలా..

కూరగాయల మార్కెట్‌ దుకాణాలల వేలం పాటల్లో గుడ్‌విల్‌ కేటాయింపుల్లో శిల్పా మోహన్‌రెడ్డి తన వర్గానికి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ద్వారా రూ.లక్షల్లో భారం పడేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ముఖ్య నాయకులు నంద్యాల కూరగాయల మార్కెట్‌ కార్యవర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు రంగంలోకి దిగారు.

YS Jagan Shock To Bhuma Akhila Priya
వీరి కృషి ఫలితంగానే...

వీరి కృషి ఫలితంగానే...

నంది గ్రూపు సంస్థల ఎండీ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమో హన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మైనార్టీ నాయకుడు డాక్టర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌ కరీంని టీడీపీలోకి చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు చెబుతున్నారు.

కరీం చేరికతో ఉత్సాహం....

కరీం చేరికతో ఉత్సాహం....

కరీం చేరికతో మంత్రి అఖిలప్రియకు జోష్ పెరిగినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. కూరగా యల మార్కెట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కరీం భాయ్‌కి కండువా కప్పి మంత్రులు పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవలే ఇంతియాజ్...

ఇటీవలే ఇంతియాజ్...

ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో నేషనల్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌ తెలుగుదేశంలో చేరారు. ఇంతియాజ్‌ చేరిక వల్లనే కాకుండా కరీం చేరికవల్ల కూడా మైనారిటీలు తమ వైపు తిరుగుతారనే అభిప్రాయంతో టిడిపి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party Nandyal assembly seat candidate Shilpa Mohan Reddy's follower Karim has joined in Telugu Desam party.
Please Wait while comments are loading...