బాబుతో వచ్చా, ఆతనే లేకుంటే: షిండే, భయపడ:సీతక్క
హన్మంతు షిండే ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై షిండే సోమవారం స్పందించారు. తెలంగాణలో చంద్రబాబే లేనప్పుడు తాను ఉండి ఎందుకని పార్టీ మారానని షిండే వ్యాఖ్యానించడం విశేషం.
పార్టీని వీడను: సీతక్క
తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరుగుతోందని, ఇది సరికాదని వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు సీతక్క అన్నారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను నక్సల్స్ ఉద్యమం నుండి వచ్చానని, ఓటమికి భయపడి పారిపోయే రకం కాదన్నారు.
సభ వాయిదా
సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైన తర్వాత సభాపతి నాదెండ్ల మనోహర్ పార్టీల వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీంతో సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.