కార్తీక తొలి సోమవారం, పోటెత్తిన భక్తులు- శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు..!!
కార్తీక మాసం సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం శివనామస్మరణతో దీపారాధన చేశారు. కార్తీక దీపాల కాంతుల మధ్య ఆలయ ప్రాంగణా లు శోభాయమానంగా వెలిగాయి. అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ప్రత్యేక అర్చనలు, అభిషేకాలూ చేశారు.
కార్తీకమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తుల శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నదులు, పవిత్ర జలాల్లో పుణ్యస్నానా లు ఆచరిస్తున్న భక్తులు, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠగోదావరి నదిలోనూ, పాలకొల్లు క్షీరారామ క్షేత్రంలోనూ భక్తుల తాకిడి భారీగా కనిపిస్తోంది. శ్రీశైల మహాక్షేత్రంలో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాజమండ్రి పుష్కర ఘాట్లలోనూ భక్తులు పెద్దఎత్తున నదీ స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ తమ మొక్కు లు చెల్లించుకుంటున్నారు. గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతు న్నాయి. నరసాపురం వశిష్ఠ గోదావరి నదిలో భక్తులు తెల్లవారుజామునుంచే పుణ్యస్నానాలు ఆచ రించి, నదిలో కార్తీక దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఆలయాల్లో కార్తీక శోభ
అదే విధంగా పంచారామ క్షేత్రాలలో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. క్షీర రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా.. రాజమండ్రిలోనూ కార్తీక శోభ సంతరించుకుంది. గోదావరి పుష్కర ఘాట్‌లు భక్తులతో కళకళలాడుతున్నాయి. కోటి లింగాల ఘాట్ వద్ద ఉన్న కోటిలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు, ఉమామార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైల మల్లన్న ఆలయానికి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజామునే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.












Click it and Unblock the Notifications
