ప్రశ్నించే విధానం నచ్చింది: పవన్‌పై శివాజీ, కానీ..

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ప్రసంగంపై మరో సినీ నటుడు శివాజి స్పందించారు. తనకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించే విధానం తనకు నచ్చిందని శివాజీ తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్ విధానాలు తనకు అర్థం కాలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏ విధానాలకు కట్టుబడ్డారో తనకు అర్థం కాలేదని శివాజీ తెలిపారు.

విప్లవ వీరుడు చేగువేరా అంటే ఇష్టమని చెప్పుకునే పవన్.. భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ఏదైమైనా పవన్ ప్రశ్నించే విధానం తనకు నచ్చిందని శివాజీ తెలిపారు. ఇటీవల బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ గుజరాత్ వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. పవన్ తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తే.. ఆయన పాటించే విధానాలు తెలుస్తాయని చెప్పారు.

Shivaji explains his opinion on Pawan Kalyan speech

కాగా, శివాజీ పాలెం బస్సు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని వారి తరపున ప్రభుత్వంతో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడికి పలు పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు అందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అంతేగాక ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాష్ట్రంలో శివాజీ ప్రచారం చేస్తారని కూడా ప్రచారం సాగింది. అయితే శివాజీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉన్నట్లు కూడా శివాజీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడమే గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+