బిజెపి నేతలకు భార్యలు సహకరించొద్దు: శివాజీ ఫైర్, ‘కేంద్రమంత్రులు వస్తే..’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలపై సినీనటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదాకు దూరమై, అప్పుల్లో కూరుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలే కారణమనన్నారు.
హోదా వచ్చే వరకు బిజెపి నేతలకు వారి భార్యలు ఇంట్లో అన్నం కూడా పెట్టకుండా మాడ్చితేనే వారికి బుద్ధి వస్తుందని శివాజీ సలహా ఇచ్చారు. బీజేపీ కేంద్ర మంత్రులు పర్యటనలకు వస్తే అడ్డుకోవాలని, వారు బయట తిరగనీయలేని పరిస్థితి కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

అతి త్వరలో 'బీజేపీ హఠావో - ఆంధ్రా బచావో' నినాదంతో ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. బీజేపీ నేతలెవరికీ, వారి భార్యలు సహకరించరాదని కోరారు. ఏపీని అడుక్కునే పరిస్థితికి తెచ్చిన వారికి బుద్ధి చెప్పే బాధ్యత వారి ఇంట్లోని మహిళలదేనని అన్నారు.
గతంలో కూడా శివాజీ బిజెపి నేతలపై పలుమార్లు విరుచుకుపడ్డారు. హోదాపై హామీ ఇచ్చి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలిచ్చి నేతలు.. అధికారం చేపట్టగానే మర్చిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications