బావతో వివాహేతర సబంధం వద్దన్నందుకు ఆమె ఏం చేసిందంటే?

వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భార్యే తన భర్తను చంపించింది. అయితే తర్వాత తనకు ఏం తెలియనట్టుగానే నటించింది. అయితే పోలీసుల విచారణలో భార్యే ఈ ఘటనలో కీలకపాత్రదారిగా పోలీసులు గుర్తించారు.

ధర్మవరం: వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి భార్యే తన భర్తను చంపించింది. అయితే తర్వాత తనకు ఏం తెలియనట్టుగానే నటించింది. అయితే పోలీసుల విచారణలో భార్యే ఈ ఘటనలో కీలకపాత్రదారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకొంది.

ధర్మవరానికి చెందిన శివయ్యను ఈ నెల 11వ, తేదిన గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్టుగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లికి చెందిన శివయ్య ధర్మవరంలోని రంగుల అద్దకం పరిశ్రమలో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు.

శివయ్య భార్య ఆశ్వినికి ఆమె సమీప బంధువు ఆంజనేయులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భర్త శివయ్య భార్యను పలుమార్లు మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.

Shivayya murdered for illegal affair in Dharvam town

బావతో వివాహేతర సంబంధం కొనసాగించాలంటే భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆశ్విని భావించింది. దీంతో తన భర్తను చంపేయాలని ప్రియుడు ఆంజనేయులును కోరింది. దీనికి అతను కూడ అంగీకరించాడు.

ఈ నెల 10వ, తేదిన బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళివస్తామని చెప్పి శివయ్యను ఆంజనేయులు కారులో తీసుకెళ్ళాడు. మార్గమధ్యంలో శివయ్యకు ఆంజనేయులు మద్యం తాగించాడు. అనుకొన్న ప్రకారంగా కత్తితో పొడిచి బీరుబాటిళ్ళతో శివయ్యను ఆంజనేయులు గాయపర్చాడు.

పెనుకొండ సమీపంలోకి తీసుకువచ్చి బండరాయితో మోది గొంతుకు లుంగీ బిగించి చంపేశాడు. అనంతరం రాళ్ళ మధ్యలో శవాన్ని పడేశారు.అయితే శివయ్య ఇంట్లోనే ఉన్న నిందితులు ఆశ్విని ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది.దీంతో పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+