'శోభా'యమానం: కెసిఆర్ భార్య బతుకమ్మ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీమణి శోభ శుక్రవారం తెలంగాణ భవన్‌లో బతుకమ్మ ఆటలో పాల్గొని అందరినీ మురిపించారు. చిత్తూచిత్తూల బొమ్మ/శివుడి ముద్దూల గుమ్మ/ బంగారు బొమ్మ వచ్చె/నమ్మో ఈ వాడలోన.. అంటూ బతుకమ్మ వేడుకలను మూడో రోజు శుక్రవారం నగరంలో ఘనంగా నిర్వహించుకున్నారు.
హైదరాబాదులోని డీజీపీ ఆఫీస్ పూలవనాన్ని తలపించింది. ఉద్యోగుల బతుకమ్మ ఆటపాటలతో సచివాలయం సందడిగా మారింది. సచివాలయంలో ఉద్యోగులు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సతీమణి శ్రీనిత హాజరయ్యారు.
సచివాలయ ఉద్యోగులు సుభద్ర, అరుణశ్రీ, లలిత, విజయ తదితరులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పుడు బతుకమ్మ గురించి ఆసక్తిగా అడుగుతున్నారనిఅన్నారు. సమైక్య రాష్ట్రంలో సంక్రాంతికే ప్రాధాన్యం ఇచ్చారని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కృషి ఫలితంగా ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ అంటే తెలిసిందని చెప్పారు.

కెసిఆర్ సతీమణి శోభ
టీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ రాకతో కార్యకర్తలు హుషారుగా చేతులు కలిపారు.

ఇలా బతుకమ్మను ఎత్తుకున్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీమణి శోభ బతుకమ్మను ఎత్తుకుని తెలంగాణ భవన్‌లో ఇలా కనిపించారు.

డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీమణీ శోభతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

చేతులు కలిపారు...
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయం తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సతీమణి శోభ, పద్మా దేవేందర్ రెడ్డి ఇలా బతుకమ్మ ఆడారు.

ఆడుతూ పాడుతూ..
తెలంగాణ భవన్‌లో బతుకమ్మ ఆట ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ శోభ, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు..

తీరొక్క పూల బతుకమ్మ
తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను పెట్టి శోభ, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు వలయంగా తిరుగుతూ బతుకమ్మ ఆడారు.

కుంకుమ తీర్చిదిద్దుతూ..
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బతుకమ్మ వద్ద ఇలా కనిపించారు. ఆమెతో పలువురు మహిళలు కూడారు.

బతుకమ్మతో పద్మా దేవేందర్..
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఇలా బతుకమ్మను తెస్తుంటే, శోభ నమస్కారం చేస్తూ..

బతుకమ్మలతో ఇలా..
తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడిన తెలంగాణ సిఎం కెసిఆర్ భార్య శోభ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి....
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications