‘రోజా ప్రవర్తన మహిళా లోకానికే తలవంపు.. ఆయన ప్రోత్సాహంతోనే..’
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రోజా వ్యవహరిస్తున్న తీరుతో మహిళల గౌరవానికే భంగం కల్గుతోందని మండిపడ్డారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
రోజా ప్రవర్తన మహిళలకు తలవంపులు తెస్తోందని ధ్వజమెత్తారు. రోజాకు మహిళలే బుద్ధిచెప్పే రోజు వస్తుందన్నారు. నిత్యం వార్తల్లో ఉండటం కోసం ఆమె ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కూడా ఆమెను అలాగే ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.

చట్టసభల్లో రోజాతో కలిసి పాల్గొనడానికి మహిళా ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పార్టీ తరపున ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు హైమావతి తెలిపారు.












Click it and Unblock the Notifications