కడపలో జగన్ కు షాక్... మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన వారి పైన, అనేక వివాదాలలో ఉన్న వారి పైన వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్ కు, వైసిపి నేత మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ఊహించని షాక్ తగిలింది. అయన సోదరుడు అహ్మద్ బాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు.

అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్ట్
అహ్మద్ బాషా పై అవుట్ లుక్ నోటీసులు ఉన్న నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కువైట్ కి వెళుతున్న క్రమంలో అతనిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. వినాయక నగర్ లోని ఒక స్థలం విషయంలో దాడి చేశారని కడప పోలీస్ స్టేషన్లో అతని పైన కేసు నమోదు కావడంతో కడప పోలీసులు అతనిని కడపకు తరలిస్తున్నారు.

shock for jagan ex deputy cm brother ahmed basha Arrested at Mumbai airport while en route to Kuwait

అహ్మద్ బాషాపైన టీడీపీ నేతలను అసభ్యంగా దూషించిన కేసులు
ఇక ఈ కేసు మాత్రమే కాకుండా కడప టిడిపి ఎమ్మెల్యే మాధవి రెడ్డి, శ్రీనివాసరెడ్డి లను అహ్మద్ బాషా అసభ్య పదజాలంతో దూషించిన కేసులు ఉన్నాయి. అంతేకాదు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డిపైన పోలీస్ స్టేషన్లోనే దాడికి ప్రయత్నం చేశారని అహ్మద్ బాషాపైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడప పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కడపకు తీసుకువచ్చి సోమవారం కోర్టులో హాజరు పరిచే అవకాశం కనిపిస్తుంది.

అంజాద్ బాషాకు తలనొప్పిగా అనుచరుడి వ్యవహారం
ఇదిలా ఉంటే ఇటు ఈ వ్యవహారం మాత్రమే కాకుండా, అనుచరుల అరెస్టుతో మరో వివాహం కూడా అంజాద్ బాషాకు తలనొప్పిగా తయారైంది. అంజద్ బాషా అనుచరుడు ఇబ్రహీం మియాను మహిళల దేహశుద్ధి చేసి, కడప వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. కొంతమంది మహిళల వద్ద మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి 50 లక్షలు అప్పు తీసుకుని 13 ఏళ్లు దాటిన తిరిగి చెల్లించకపోవడంతో, అప్పు ఇచ్చిన మహిళలు నిలదీశారు.

మహిళలు అంజద్ బాషా ఇంటికి వెళ్లి ధర్నా
దీంతో అతను ఆ డబ్బులను ఇబ్రహీం మియా అనే వ్యక్తికి ఇచ్చినట్టుగా చెప్పారు. దీంతో మహిళలు ఇబ్రహీం మియాను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.అయితే ఈ ఇబ్రహీం మియా అంజద్ బాషా అనుచరుడు కావడంతో ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చి తన అనుచరుడిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మహిళలు అంజద్ బాషా ఇంటికి వెళ్లి ధర్నా చేశారు. పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేశారు.

ఒకరిపై ఒకరు కేసులు
దీంతో పోలీసులు మహిళలు తనపై దాడి చేశారని ఇబ్రహీం మియా ఇచ్చిన ఫిర్యాదుతో మహిళలపైన కేసు నమోదు చేశారు. ఇక డబ్బులు అడిగితే తమతో అసభ్యకరంగా మాట్లాడాడని ఇబ్రహీం మియా పైన మహిళలు ఫిర్యాదు చేయడంతో అతనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+