వివేకా హత్యకేసులో జగన్ కు ఊహించని షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుతం కీలక పరిణామం చోటు చేసుకుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఈ కేసులో సిబిఐ తీరుతో కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
మిలియన్ డాలర్ల ప్రశ్నగానే వివేకా హత్యకేసు
2019 సాధారణ ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా ఆయన ఇంట్లో మృతి చెందిన విషయం తెలిసిందే అప్పటినుంచి ఇప్పటివరకు వివేకానంద రెడ్డి హత్య కేసు పైన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎలా చేశారు? దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అన్నది మాత్రం ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్న గానే ఉండిపోయింది.

వైఎస్ వివేకా హత్య లో నిందితులుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి
కేసును విచారిస్తున్న సిబిఐ ఈ కేసులో వైయస్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితులుగా వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అనూహ్య పరిణామాల మధ్య అరెస్టయిన అవినాష్ రెడ్డికి వెంటనే బెయిల్ లభించగా, భాస్కర్ రెడ్డి కొంతకాలం జైల్లో ఉండి ఎన్నికలకు ముందు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు.
నిందితుడిగా పేరు తొలగించాలని కోర్టుకు దస్తగిరి
అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యలో నిందితుడిగా ఉన్న వివేకా డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే .అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని కేసు విచారణకు తాను సహకరిస్తానని కోర్టును ఆశ్రయించాడు.
దస్తగిరి పేరు నిందితుల జాబితా నుండి తొలగింపు
దీంతో దస్తగిరి పిటిషన్ విచారించిన న్యాయస్థానం దస్తగిరి అభ్యర్థన పైన సిబీఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో, ఇప్పటికే దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ సాక్షిగా చేర్చిన విషయాన్ని సిబిఐ పేర్కొనటంతో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించేందుకు అంగీకరించింది. ఇక కోర్టు నిర్ణయంతో ఇకపై వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరిని కేవలం సాక్షిగా మాత్రమే పరిగణిస్తారు. దస్తగిరిని నిందితుడిగా పరిగణించరు.
జగన్ కు ఊహించని షాక్
వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ పైన అవినాష్ రెడ్డి పైన దస్తగిరి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వివేక హత్య గురించి జగన్ కు అంతా తెలుసు అని జగన్ పైన దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. వైయస్ వివేకా హత్యలో, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శంకర్ రెడ్డి తో పాటు సీఎం జగన్ ఆయన భార్య భారతి హస్తం ఉందని షాకింగ్ ఆరోపణలు చేశారు దస్తగిరి. ఇప్పుడు దస్తగిరి ఈ కేసులో నిందితుడిగా కాకుండా సాక్షిగా మారడం జగన్ కు ఊహించని షాక్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications