టిడిపికి షాక్:వైసిపిలోకి చేరనున్న తెదేపా సీనియర్ నేత

విజయవాడ:టిడిపికి అతి త్వరలో పార్టీ పరంగా మరో ఎదురు దెబ్బ తగలనుందా?...అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. విజయవాడకు చెందిన టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసిపిలో చేరనున్నారట. అందుకోసమే త్వరలోనే టిడిపికి రాజీనామా ప్రకటించనున్నారట.

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవాడకు చేరుకున్న సమయంలో యలమంచిలి రవి ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జ్యోతుల చంటిబాబు, ఆ తరువాత జగన్ గుంటూరు జిల్లా పాదయాత్రలో సత్తెనపల్లి నియోజకవర్గం టిడిపి నేత నిమ్మకాయల రాజనారాయణ, మరికొందరు ఆ పార్టీలో చేరగా, తాజాగా విజయవాడలో యలమంచిలి రవి చేరనుండటం టిడిపికి పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పాలి.

Shock To TDP : Ex MLA Yalamanchili Ravi Likely to Join YCP

మారిన రాజకీయాల సమీకరణాల నేపథ్యంలో వీలైనంతమంది టిడిపి నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని, ఈ ప్రక్రియను గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ముమ్మరం చెయ్యాలని వైసిపి భావిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రకారమే మరీ అప్రధాన నేతలు కాకుండా ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు తమ పార్టీలో చేరుతుండటం వైసిపికి నూతనోత్సాహాన్ని ఇస్తోంది. గతంలో పిఆర్పి తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలిచిన యలమంచిలి రవిని వైసిపిలోకి తీసుకోవాలని ఆ పార్టీ ఎప్పటినుండో ప్రయత్నిస్తుండగా మొత్తానికి ఇప్పటికి ఇరువైపుల నుంచి ఈక్వేషన్లు ఒకే అయినట్లు తెలిసింది. యలమంచిలి రవి ప్రముఖ టిడిపి నేత సుజనా చౌదరికి దగ్గరి బంధువని చెబుతున్నారు.

వైసిపి అధినేత జగన్ కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన రోజునే... అంటే ఏప్రిల్ 10వ తేదీన యలమంచిలి రవి వైసిపిలో చేరేటట్లుగా వైకాపా నేతలు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇక వైసిపి అనుకున్నట్లుగానే యలమంచిలి రవి వైకాపాలో చేరితే ఈ పరిణామం టిడిపికి బాగానే నష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. సామాజిక సమీకరణాల దృష్ట్యా వైసిపిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు పెద్ద స్టేచర్ ఉన్న వాళ్లు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అందువల్ల విజయవాడ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైకాపాలో చేరటం ఆ పార్టీకి అటు సామాజిక సమీకరణాల పరంగా...అలాగే ఎపిలో అత్యంత కీలకమైన రాజధాని ప్రాంతంలో కొంత పట్టున్న నేతగా మరో రకంగానూ ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+