చంద్రబాబు నిర్ణయంతో వైసీపీకి షాక్, ఆ జిల్లా భూముల యజమానులు సేఫ్

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కొన్ని నెలలకు ముందు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక అక్రమాలు జరిగాయని వెలుగు చూసింది. వేల కోట్ల రూపాయల విలువైన భూములు కొట్టేయడానికి అప్పటి వైసీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారని తెలిసింది. అయితే ఎన్నికల సమీపించడంతో రిజిస్ట్రేషన్లు చేయించుకోలేని కొందరు వైసీపీ నాయకులు తరువాత కూడా ఫ్రీహోల్డ్ భూములు కాజేయడానికి ప్రయత్నించారని వెలుగు చూసింది.

అయితే ఇంతలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రావడంతో ఆ వైసీపీ నాయకులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారని తెలిసింది. ముఖ్యంగా నంద్యాల పట్టణం సమీపంలోని భూ దోపిడీ దారులపై అనేక మంది బాధితులు ఫిర్యాదులు చెయ్యడంతో వెంటనే రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో భూములు లాక్కోవాలని ప్రయత్నించిన వైసీపీ నాయకులు అయోమయంలో పడ్డారని తెలిసింది.

Shock to YCP leaders who tried to grab freehold lands in Nandyala district

ఇదే సందర్బంలో కొందరు భాదితులు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సహాయంతో కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. సమాచారం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం నంద్యాల జిల్లాలోని పలు చోట్ల భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాని ఆదేశాలు జారీ చేసింది. జగన్ ప్రభుత్వం గత ఏడాది ఎసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్యం హక్కులు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఎసైన్డ్ భూములు ఉన్న వారిని, డీ పట్టా భూముల లబ్దీదారులను సంప్రదించిన వైసీపీ నాయకులు ఆ భూములను లాక్కొవడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎదురు తిరిగిన ఆ భూముల యజమానులను బెదిరించి వారిని నుంచి కొన్ని భూములను బలవంతంగా లాక్కొన్నారని, అయితే అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోవడం వైసీపీ నాయకులు సైలెంట్ అయ్యారని తెలిసింది.

చేతికి వచ్చిన భూములు వెనక్కి వెళ్లిపోవడం, కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఆ విషయం వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, నందికొట్కూరు, శ్రీశైలం, డోన్ ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాల భూములు ఫ్రీహోల్డ్ ప్రక్రియలో ఉన్నాయని అధికారులు అంటున్నారు. నంద్యాల జిల్లాలోనే కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని చాలా మండలాల్లో అసైన్డ్ భూములపై, ఫ్రీహోల్డ్ భూములపై కన్ను వేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు హడలిపోతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+