రాజ్యసభకు ముందు జగన్‌కు ఇద్దరు షాక్: నాలుగో స్థానంపై సస్పెన్స్

విజయవాడ: జూన్‌ 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీ నుంచి రాజ్యసభ ఎంపిక చేయాల్సిన అభ్యర్థులు విషయంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ పేరు ఖరారైంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు దాదాపు ఖరారైంది.

మరో పేరును ఖరారు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల బలం ప్రకారం టిడిపికి మూడు సీట్లు దక్కుతాయి. వైసిపికి ఒక సీటు దక్కనుంది. టీడీపీకి గెలిచే మూడు సీట్లలో ఒకటి మిత్రపక్షం బీజేపీకి ఇవ్వవలసి ఉంది. మిగిలినవి రెండు. అందులో సుజనా చౌదరి పేరు ఖరారయింది. మరో పేరు ఖరారు కావాల్సి ఉంది.

టిడిపి రెండో స్థానం కోసం పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొని ఉంది. మాజీ మంత్రి టిజి వెంకటేష్ పార్టీ అధినేతను సోమవారం కలిశారు. ఆయనతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు కలిశారు. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.

Shock to YS Jagan: Two MLAs to join Telugudesam

ఇప్పటికే హేమలత, కంభంపాటి రామ్మోహన రావు, జెఆర్ పుష్పరాజ్‌, బిటి నాయుడు, బీద మస్తాన్‌రావు తదితరులలో ఒకరికి అవకాశం దక్కనుంది. తాజాగా, టీజీ వెంకటేష్ కూడా సీటు ఆశిస్తున్నారు.

నాలుగో సీటుపై సస్పెన్స్

రెండు సీట్లు టిడిపి, ఒక సీటు మిత్రపక్షం బీజేపీకి పోగా.. నాలుగో సీటు బలం ప్రకారం వైసిపి గెలుచుకుంటుంది. అయితే, ఈ స్థానంలో పోటీ పెట్టాలని టిడిపి భావిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి 67 స్థానాలల్లో గెలిచింది. అందులో 17 మంది ఇప్పటికే టిడిపిలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధమయ్యారు.

తమ వైపు చేరిన దాదాపు ఇరవై మందితో పాటు.. అభ్యర్థిని నిలబెడితే వైసిపిలోనే ఉంటూ తమకు మద్దతిచ్చే వారి విషయమై చర్చించేందుకు చంద్రబాబు పార్టీలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలతో సోమవారం నాడు భేటీ అయ్యారు. వీరితో రాజ్యసభ నాలుగో స్థానంపై చర్చిస్తున్నారు.

నాలుగో అభ్యర్థిని స్వతంత్రంగా నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలా అయితే, వైసిపి నుంచి గెలిచి తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఆయనకు ఎలాగు వేస్తారు. అలాగే, వైసిపిలోనే ఉంటున్న ఎమ్మెల్యేలతో కూడా ఓటు వేయించాలని, తద్వారా నాలుగో సీటు దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.

టిడిపిలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికలకు ముందు జగన్‌కు షాక్. ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జూన్ 1వ తేదీన, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు జూన్ 2వ తేదీవ వైసిపిలో చేరనున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+