గజదొంగ శివ: దిమ్మ తిరిగే విలాసవంతమైన జీవన శైలి
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన చైన్ స్నాచర్ శివ జీవనశైలి దిగ్భ్రమ కలిగించే విధంగా ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసులకే అది ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు. నార్సింగ్‌లోని శివ అద్దెకు ఉంటున్న ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్‌లో అతని లగ్జరీ జీవితానని చూసి పోలీసులు ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు.

అతను ఉపయోగిస్తున్న ఫర్చీచర్, ప్లాస్మా టీవీ నుంచి అక్వేరియం వరకు అన్ని అత్యంత ఖరీదైనవే. రెండు లగ్జరీ కార్లు, ఓ స్పోర్ట్స్ బైక్, స్కూటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తి విశాలమైన ఇల్లు, ఖరీదైన ఇంటీరియర్స్ చూసిన పోలీసులు నిరుత్తురులైనట్లు వార్తలు వచ్చాయి.
చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే శివ ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించేవాడని అంటున్నారు. మూడు నెలలకు ఒకసారి ఇల్లు మారేవాడు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యం చేసుకుని అతడు చిరునామా అడుగుతున్నట్లు నటించి వారి మెడల్లోని బంగారు ఆభరణాలను లాక్కుని వెళ్లేవాడు.

అప్పటికే మరొకరు కారులో సిద్ధంగా ఉండగా, ఆ వాహనంలో ఎక్కి శివ పారిపోయేవాడని చెబుతున్నారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలను అమ్మి బార్యాపిల్లలతో ఇతర రాష్ట్రాలకు విహార యాత్రలకు వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపేవాడు.
అంతేకాకుండా, తన భార్య ఖాతాలో డబ్బులు వేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. గతంలో ఓసారి పోలీసులకు చిక్కినట్లే చిక్కి పరారయ్యాడు. రెండు రోజుల క్రితం కూడా అతను ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు శివ నివాసాన్ని గుర్తించారు. శివ భార్యతో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications